కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు
కాజీపేట , మేజర్ న్యూస్, క్యాతంపల్లి గ్రామం (కేశవనగర్ సమీపంలో) శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి, కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ నెల 24-11-2026, మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి విశేష పూజలు నిర్వహించడంతో పాటు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనదలచిన భక్తులు రూ.516 చెల్లించి తమ గోత్రనామాలను ముందస్తుగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. భక్తులు ముందుగానే ఆలయ నిర్వాహకులను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన నిర్వహించే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
రిపోర్టర్ ; గిరిప్రసాద్, కాజీపేట, హనుమకొండ జిల్లా