BREAKING
ఎనుమాముల మార్కెట్ యధాతధంగా కొనసాగుతుంది దివ్యాంగుల వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ 39 సార్లు రక్తదానం చేసిన జి. జయరాజుకు ఘన సన్మానం చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాలకు మంత్రి దామోదర రాజనర్సింహ అమెరికా ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో సాంకేతిక లోపం: ఇండియా డైరెక్ట్ ఫ్లైట్స్ సురక్షితం, కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన

భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్

Select Suryaa Now
భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్

అత్వెల్లి చెరువు వద్ద ఘనంగా ఛత్‌ పూజ మహోత్సవం.. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ ఈటల 

మేడ్చల్‌, మేజర న్యూస్ : 

కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలంతా ఒక్కచోట చేరి భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛత్‌ పూజ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ప్రతీకగా నిలుస్తుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం మేడ్చల్‌ మండలం అత్వెల్లి చెరువు వద్ద జన సేవ సంఘ్‌ ఛత్‌ పూజ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఛత్‌ పూజ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సూర్య భగవానుడికి, ఆయన సోదరి ఛటీ మైయా (సృష్టి దేవి)కి కృతజ్ఞతలు తెలిపే ప్రాచీన పండుగ ఛత్‌ పూజ అని పేర్కొన్నారు. భూమిపై జీవకోటికి శక్తిని ప్రసాదించే సూర్యకాంతికి, జల వనరులకు గౌరవం తెలుపుతూ ఈ పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారని వివరించారు. నదులు, చెరువుల వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఈ పండుగ ప్రత్యేకత అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, నాయకులు అమరం మోహన్‌రెడ్డి, జన సేవ సంఘ్‌ ఛత్‌ పూజ సమితి అధ్యక్షుడు బిస్వజీత్‌ సింగ్‌, ఉపాధ్యక్షుడు ఎస్‌.ఏ.ఖాన్‌, కార్యదర్శి సురేష్‌ పండిట్‌, కోశాధికారి సుశీల్‌ తదితరులు పాల్గొన్నారు.