ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన
నెయ్యల కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూరిబాబు
పార్వతీపురం,నవంబర్ 15, మేజర్ న్యూస్ :
నెయ్యల కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూరిబాబు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నెయ్యల సామాజిక వర్గానికి సంబంధించిన పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సంఘం తరఫున ప్రస్తావించిన సమస్యలను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సావధానంగా విని, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని సానుకూలంగా స్పందించారు.సామాజిక వర్గాల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.