BREAKING
కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఘన సత్కారం.. ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డిపిఓ. ఎంపీడీవో డిప్యూటీ ఎంపీడీవో సాలూరు రైలు బండిని పునరుద్ధరించండి

సాలూరు రైలు బండిని పునరుద్ధరించండి

Select Suryaa Now
సాలూరు రైలు బండిని పునరుద్ధరించండి

 

ప్రజల కోరికను మన్నించండి

రైల్వే అధికారులు, పాలకులకు ప్రజల విజ్ఞప్తి

సాలూరు నవంబర్ 15 మే జనవరి....

      సాలూరు రైలు బండిని పునరుద్ధరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకు సంబంధిత అధికారులు, పాలకులు చొరవ చూపాలని కోరుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో మారు మూల ప్రాంతాలకు కొత్తగా ట్రైన్ సౌకర్యాన్ని కల్పిస్తున్న ప్రభుత్వాలు, అన్ని హంగులు సిద్ధంగా ఉండి, రెండు సార్లు ట్రైల్ రన్ నిర్వహించిన తరువాత కూడా రైలును ఎందుకు నడపటం లేదో అర్థం కావటం లేదంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే. బ్రిటిష్ కాలంలో సాలూరుకి పొగ బండి సౌకర్యాన్ని కల్పించటమే కాకుండా, వేగన్స్ కూడా వచ్చి పోయేవి. ఫలితంగా రైల్వే స్టేషన్ పరిసరాలు ఎంతో హడావిడిగా ఉండటమే కాకుండా స్థానిక ట్రాన్స్పోర్ట్ రంగానికి ఉపయోగకరంగా ఉండేది. అలాగే ప్రజలు సాలూరు నుండి బొబ్బిలి వరకు వెళ్లి అక్కడ నుండి విజయనగరం, విశాఖపట్నం, రాయగడ తదితర పట్టణాలకు ట్రైన్లో వెళ్లి వచ్చేవారు. అయితే రెండు దశాబ్దాల క్రితం ఆదాయం తక్కువ అన్న నెపంతో సాలూరు - బొబ్బిలి మద్య నడిచే రైలు బండిని నిలిపి వేసి, దేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన రైలు బస్సు సౌకర్యాన్ని కల్పించి, సాలూరు బొబ్బిలి మధ్య షటిల్ సర్వీస్ విధానంలో నడిపేవారు. అనంతరం అనుకున్న విధంగా ఆదాయం లేదన్న కారణంతో దీన్ని కూడా నిలిపి వేసారు. అయితే, నష్టానికి గల కారణాలను మాత్రం ఉన్నతాధికారులు అంచనా వెయ్యటంలో విఫలమయ్యారు. తమ శాఖకు చెందిన దిగువ స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, చేతి వాటం గూర్చి తెలుసుకోలేకపోయారు. ఫలితంగా సాలూరు ప్రాంత ప్రజలు ట్రైన్ సౌకర్యాన్ని కోల్పోవలసి వచ్చింది. నాటినుండి రోడ్డు రవాణాయే గతి కావటం, ఈ సందర్భంగా విలువైన సమయంతో పాటు ఆర్థికంగా నష్టపోవడం పరిపాటి అయింది. పేద ప్రజలు వైద్యం నిమిత్తం విశాఖపట్నంలో కేజీహెచ్ వంటి ఆసుపత్రులకు వెళ్లేందుకు ట్రైన్ చార్జీల కంటే ఐదు రెట్లు అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక వ్యక్తి బస్సులో విశాఖపట్నం వెళ్లి వచ్చేందుకు 350-400రూపాయలు ఖర్చు చేస్తుండగా, కేవలం 80రూపాయలతో ట్రైన్ లో వెళ్లి రావచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమల్లో ఉండగా, దీనివల్ల వృద్దులు, చిన్న పిల్లలు కూర్చునేందుకు సీట్లు లేక అవస్థలు పడుతున్నారు. కావున, సాలూరు నుండి బొబ్బిలికి రైలు బండిని నడిపితే సాలూరు తోపాటు పాచి పెంట, మక్కువ మండలాల పరిధిలోని వందలాది గ్రామాలకు చెందిన వేలాది ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది. కావున రైల్వే శాఖ, విశాఖ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న రేక్ లను నడిపితే ప్రయాణికులకు మేలు చేసిన వారవుతారు. దీనివల్ల రైల్వే శాఖకు అదనంగా ఏర్పడే ఆర్థిక బారం, ఇతర సమస్యలు ఉండవు. ప్రస్తుతం కాకినాడ-విశాఖపట్నం-కాకినాడ, విశాఖ పట్నం-విజయనగరం విశాఖపట్నం మధ్య నడిచే ట్రైన్లకు ఉన్న విరామ సమయాన్ని ఉపయోగిస్తే సాలూరుకి అదనపు రైలు బండిని మంజూరు చేయకుండా ప్రయాణికుల సమస్యలను పరిష్కరించే అవకాశం ఉందని దీనిపై అవగాహన ఉన్న సాలూరు సీనియర్ సిటిజన్లు చెబుతున్నారు. కావున రైల్వే శాఖ అధికారులు పాలకులు ఆ విధంగా ఆలోచిస్తే వేలాది ప్రయాణికులకు మేలు చేసిన వారవుతారని, అంతేకాకుండా సాలూరు ప్రాంత అభివృద్ధికి తోడ్పడిన వారవుతారని అభిప్రాయపడుతున్నారు. కావున, రైల్వే అధికారులు స్థానిక నాయకులు ఈ దిశగా ఆలోచిస్తే మంచిదని ప్రజలు భావిస్తున్నారు.