నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఘన సత్కారం..
అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ జగదీశ్వరి పిలుపు
పార్టీ బలోపేతమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు దాడి రత్నాకర్
ఎంపీపీ అభ్యర్థి నారాయణస్వామి, అంబటి రాంబాబు తదితరులకు సన్మానం
గరుగుబిల్లి,నవంబర్ 15, మేజర్ న్యూస్:ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించి, నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ సభ్యులను కురుపాం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, తెలుగుదేశం పార్టీ జిల్లా ఎన్నికల పరిశీలకులు దాడి రత్నాకర్ తదితరులు ఘనంగా సన్మానించారు. ఈమేరకు ఆదివారం కురుపాం కోటలో తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా పరిశీలకులు దాడి రత్నాకర్ అధ్యక్షతన కురుపాం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన గరుగుబిల్లి మరియు కురుపాం మండలాలకు చెందిన ఎంపీటీసీ అభ్యర్థులకు ఎంపీపీ మరియు వైస్ ఎంపీపీ,కో ఆప్షన్ మెంబర్ ఎంపిక విషయంపై శిక్షణా కార్యక్రమమును నిర్వహించారు.శిక్షణా కార్యక్రమం అనంతరం ప్రత్యేక అభినందన సభలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యు లకు శాలువలు కప్పి, పూలమాలలతో సత్కరించారు.ఈసందర్భంగా ఎంపీపీ అభ్యర్థి మరడాన నారాయణస్వామితో పాటు ఎంపిటిసి సభ్యులు అంబటి తవిటినాయుడు(రాంబాబు), జాగాన తిరుపతిరావు, ఏగిరెడ్డి దుర్గారావు, కోట శారద, పుచ్చల నీలకంఠం, వావిలపల్లి రాంప్రసాద్ ,మరడాన సూర్యుడమ్మలకు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, తెలుగుదేశం పార్టీ జిల్లా ఎన్నికల పరిశీలకులు దాడి రత్నాకర్, నియోజకవర్గ పరిశీలకులు మాదారపు వెంకటేష్ తదితరులు శాలువలు కప్పి ఘనంగా సత్కరించా రు.ఈసందర్భంగా ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకో వాల్సిన బాధ్యత నూతన ఎంపీటీసీ లపై ఉందన్నారు.ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడానికి అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిమిత్తం నియమించిన ఇన్చార్జి దాడి రత్నాకర్ మాట్లాడుతూ కార్యకర్తల కృషి మరువ లేనిదని క్షేత్రస్థాయిలో కార్యకర్తల అవిశ్రాంత కృషి వల్లే ఈవిజయం సాధ్యమైందని కొనియాడారు.పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు అందరూ సమన్వయంతో పనిచేస్తూ,రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో కురుపాం జడ్పిటిసి సభ్యులు వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్,మాజీ ఎంపీపీ ఉరిటి రామారావు,రాష్ట్ర టీడీపీ నాయకులు మరడాన తవిటినాయుడు,టిడిపి నాయకులు కోట భరత్ కుమార్, అంబటి రామకృష్ణ,మరడాన వెంకట నాయుడు, వాడ భాస్కరరావు తదిత రులు పాల్గొన్నారు.