BREAKING
మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర కొమ్మాల ఆలయంలో లియాపీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఎనుమాముల మార్కెట్ యధాతధంగా కొనసాగుతుంది దివ్యాంగుల వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ 39 సార్లు రక్తదానం చేసిన జి. జయరాజుకు ఘన సన్మానం చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాలకు మంత్రి దామోదర రాజనర్సింహ అమెరికా ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో సాంకేతిక లోపం: ఇండియా డైరెక్ట్ ఫ్లైట్స్ సురక్షితం, కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం

39 సార్లు రక్తదానం చేసిన జి. జయరాజుకు ఘన సన్మానం

Select Suryaa Now
39 సార్లు రక్తదానం చేసిన జి. జయరాజుకు ఘన సన్మానం

కాజీపేట, మేజర్ న్యూస్, 39 సార్లు రక్తదానం చేసి ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు తన వంతు సేవలందిస్తున్న రక్తదాత జి. జయరాజుకు గుంటూరులో ఘన సన్మానం లభించింది. సమాజ సేవే లక్ష్యంగా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జయరాజు రక్తదాన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని అందజేశారు. గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో కే బి ఆర్  ఫౌండేషన్ 8వ వార్షికోత్సవం, సమాజ సేవకుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. అఖిల భారత నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సంక్షేమ సంఘం, కే బి ఆర్  ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్మన్ కొడవటికంటి బాలరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీమతి ఉప్పుటూరి సీతామహాలక్ష్మి జాతీయ సేవా రత్న పురస్కారం సందర్భంగా జి. జయరాజును ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేసి అభినందించారు. అదేవిధంగా తలసేమియా నీడ్స్ బ్లడ్ సెంటర్ ( టి ఎన్ బి సి ), గుంటూరు ఆధ్వర్యంలో జయరాజుకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందజేశారు. కె.వి.ఆర్  ఫౌండేషన్ 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన రక్తదాన శిబిరంలో జయరాజు 39వసారి రక్తదానం చేయడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా జి. జయరాజు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఒక వ్యక్తి చేసే రక్తదానం మరొకరికి పునర్జన్మ ప్రసాదిస్తుందని పేర్కొన్నారు. రక్తం అవసరమైన వారికి సకాలంలో అందించేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావిస్తూ 39 సార్లు రక్తదానం చేసిన జయరాజును పలువురు అభినందించారు. కార్యక్రమంలో వివిధ సేవా సంస్థల ప్రతినిధులు, రక్తదాతలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

రిపోర్టర్; గిరి ప్రసాద్ ,కాజీపేట హనుమకొండ జిల్లా