కొమ్మాల ఆలయంలో లియాపీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
గీసుగొండ, మేజర్ న్యూస్, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) వరంగల్-2 బ్రాంచ్ ఏజెంట్ల యూనియన్ లియాఫీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆదివారం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ హనుమంతు, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కోడూరి రామాచార్యులు, ఫణీంద్ర.విష్ణు స్వామివారికి ప్రత్యేక అర్చనలు, నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం బ్రాంచ్ అధ్యక్షులు ఆకుల కుమారస్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పులి సుధాకర్ గౌడ్ నూతన కమిటీ బాధ్యులకు నియామక పత్రాలు అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. 1964లో స్థాపించబడిన లియాఫీ యూనియన్ ఎల్ఐసీ ఏజెంట్ల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించుకోవడం ఆనందదాయకమన్నారు. సీనియర్ బ్రాంచ్ మేనేజర్ హనుమంతు మాట్లాడుతూ ఏజెంట్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఏజెంట్లు ఆర్థికంగా ఎదుగుతూ వ్యాపారంలో ముందుండి తమ కుటుంబాలకు ఆర్థిక అడగానిలవని . ప్రతి కుటుంబానికి బీమా ఆవిష్కతను వివరించాలని సూచించారు.
అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఏజెంట్లు ముందుకు సాగాలని, ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థిగా ఉంటూ కొత్త విషయాలను అధ్యయనం చేసి బీమా రంగంలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో జోనల్ నాయకులు ఎం. రాజిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు పులి సుధాకర్ గౌడ్, కోశాధికారి ప్రభాకర్, డివిజన్ రెసిడెన్సీ సెక్రటరీ రాజశ్రీనివాస్, బ్రాంచ్ అధ్యక్షులు ఆకుల కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి దురిశెట్టి సంతోష్, కోశాధికారి ప్రభాకర్, మీడియా సెక్రటరీ కోలా కృష్ణమూర్తి, తండ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్; విష్ణు చందర్, గీసుకొండ ,వరంగల్ జిల్లా