BREAKING
ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఘన సత్కారం.. ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డిపిఓ. ఎంపీడీవో డిప్యూటీ ఎంపీడీవో సాలూరు రైలు బండిని పునరుద్ధరించండి కశ్మీర్ లోయ, చీనాబ్ వ్యాలీలో వరుస ఉగ్రదాడులు: భద్రతా బలగాల విజయాలకు ఎదురైన కొత్త సవాల్! తొలి రోజు నామినేషన్లకు స్పందన దశదిన కర్మ కు హాజరైన సర్పంచ్.. బండి స్వామి పీఎస్ఎల్వీ రీ-ఎంట్రీపై తొందరపాటు తగదు.. అనంతగిరి లో అందుబాటులోకి వచ్చిన ఏకలవ్య పాఠశాల

భగవాన్ బిర్సా ముండా పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం

Select Suryaa Now
భగవాన్ బిర్సా ముండా పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం

మంగపేట, మేజర్ న్యూస్, మండలంలోని రాజుపేటలో భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివాసి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ రామ కృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్, ములుగు జిల్లా బీఆర్ఎస్ యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ నాగ రమేష్ హాజరై బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిర్సా ముండా ఆదివాసీల హక్కుల కోసం బ్రిటిష్ వారిపై, జమీందార్లపై పోరాడి 24 ఏళ్లకే అమరుడయ్యారని, ఆయన త్యాగం భావితరాలకు ఆదర్శమన్నారు. కార్యక్రమం లో ఆదివాసి నాయకులు పోలేబోయిన సుధాకర్, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు నల్లబోయిన లక్ష్మణ్ దొర, ఆదివాసీ జెఏసి నాయకులు పోలేబోయిన ఆదినారాయణ, ఉద్యోగ సంఘం నాయకులు మద్దెల అంజయ్య, ఆదివాసి పెద్దలు పోలబోయిన రామరాజు, సోయం అచ్చయ్య, పండా శ్రీను, ఎట్టి సారయ్య, మేకల రాందాసు, గొప్ప చంద్ర కాంత్, గట్టిపల్లి అర్జున్, కొమరం రవి, పోలెబోయిన నాగార్జున, చందా పూర్ణ, కొమరం పుల్లారావు, గట్టిపల్లి అర్జున్ తదితర ఆదివాసీలు పాల్గొన్నారు.

రిపోర్టర్; స్నేహ కుమార్, మంగపేట, ములుగు జిల్లా