BREAKING
బ్రాహ్మణ సంఘం ఆశీస్సులు మరువలేనివి: మున్సిపల్ చైర్‌పర్సన్‌ చింతకాయల పద్మావతి పి.బాలారం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం. భగవాన్ బిర్సా ముండా పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం ముంబై, ఎంఎంఆర్ ప్రాంతాల్లో కిలోకు రూ. 1.50 పెరిగిన సీఎన్‌జీ ధర: కొత్త రేట్లు, ఆటో యూనియన్ల డిమాండ్ వివరాలు ఇవే! తాళపత్ర గ్రంథాలను విడుదల విడుదల చేసిన ప్రమాదకర స్థాయిలో కళ్యాణపులో రిజర్వాయర్ నీటిమట్టం టిడిపి పార్టీ అధ్యక్షుడు శంకర్రావు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ మొదటిరోజు 81 నామినేషన్లు అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ మహేష్ వైసీపీలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు చేరిక ఎల్-నినో ముప్పుపై ఆర్థిక & వ్యవసాయ రంగ నిపుణుల హెచ్చరిక గ్రంథాలయాల్లో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం చేసి... పెనుగొల్లు విషాద ఘటనలో గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యం! పొంగలిపాకలో వైభవంగా గుబ్బలమ్మ తల్లి విగ్రహ ఆవిష్కరణ (నేడు అమ్మవారి సన్నిధిలో కార్తీక వనభోజనాలు) భారత ఆరోగ్య రంగంలో ప్రైవేట్ ఆసుపత్రుల ఆధిపత్యం

ముఖ్యమంత్రి బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు16 ఎకరాల్లో సభా ప్రాంగణం.. లెవెలింగ్ పనులు దాదాపు పూర్తి

Select Suryaa Now
ముఖ్యమంత్రి బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు16 ఎకరాల్లో సభా ప్రాంగణం.. లెవెలింగ్ పనులు దాదాపు పూర్తి

### 

### 

సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ కె. హైమావతి

సిద్దిపేట, ప్రతినిధి: ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని సూచించారు.ఆదివారం సాయంత్రం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాగదేవత ఆలయం ముందు భాగంలో, నందాల వెంకట లక్ష్మి గార్డెన్ వెనుకవైపు బైపాస్, చిన్నగుండవెల్లి రోడ్డుకు ఆనుకొని సుమారు 16 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభ ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సభ కోసం ఎంపిక చేసిన ప్రాంగణంలో ట్రాక్టర్లు, డోజర్ల సహాయంతో చేపట్టిన నేల చదును పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులు రూపొందించిన మ్యాప్, ప్రణాళిక ప్రకారం వేదిక నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

వీఐపీలు, ప్రజాప్రతినిధులు, మీడియాకు ప్రత్యేక ఏర్పాట్లు

భారీ బహిరంగ సభ వేదికతో పాటు వీఐపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రతి విభాగానికి తగిన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.వీఐపీలు, అధికారుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని, సభకు వచ్చే ప్రజల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లను ముందస్తు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని సూచించారు.

భారీ కేడింగ్.. విద్యుత్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

సభా ప్రాంగణంలో ప్రజల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన చోట పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులను వేగవంతం చేయాలని సూచించారు.సభ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను నాణ్యతతో, సమయానికి పూర్తి చేసి కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ పరిశీలనలో సిద్దిపేట ఆర్డీఓ సదానందం, ఏసీపీ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ హరి కిరణ్, పోలీస్ శాఖ అధికారులు, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖల అధికారులు, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.