మొదటిరోజు 81 నామినేషన్లు అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ మహేష్
రావికమతం నవంబర్ 15 మేజర్ న్యూస్ : మండలంలో మొదటిరోజు 81 నామినేషన్ లు దాఖలు అయ్యాయని డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ మహేష్ తెలిపారు. మండలంలో 28 పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు స్వీకరణకు 8 కేంద్రాలు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే అన్నారు. వీటీలో సర్పంచ్ పదవి పోటీకి 23 నామినేషన్లు , వార్డు మెంబర్లు పోటీకి 58 నామినేషన్లు స్వీకరించమని అయన తెలిపారు. ఈనెల 17 వరకు మాత్రమే నామినేషన్లు స్వీకరణకు గడువు ఉందని వివరించారు.