గ్రంథాలయాల్లో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
మాకవరపాలెం, నవంబర్ 15, మేజర్ న్యూస్:
విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుంటూ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వి.సతీశ్ కుమార్, కార్యదర్శి కుమార్ రాజా సూచించారు. మాకవరపాలెం శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం విద్యార్థులకు చదరంగం పోటీలు నిర్వహించారు. గ్రంథాలయ అధికారి చంద్రకళ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను తిలకించారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ చదరంగం వంటి మేధోపరమైన పోటీలు వారిలో ఆలోచనా శక్తి, ఏకాగ్రత, నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. పుస్తక పఠనంతో పాటు ఇటువంటి పోటీల్లోనూ విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.