BREAKING
ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఘన సత్కారం.. ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డిపిఓ. ఎంపీడీవో డిప్యూటీ ఎంపీడీవో సాలూరు రైలు బండిని పునరుద్ధరించండి కశ్మీర్ లోయ, చీనాబ్ వ్యాలీలో వరుస ఉగ్రదాడులు: భద్రతా బలగాల విజయాలకు ఎదురైన కొత్త సవాల్! తొలి రోజు నామినేషన్లకు స్పందన దశదిన కర్మ కు హాజరైన సర్పంచ్.. బండి స్వామి పీఎస్ఎల్వీ రీ-ఎంట్రీపై తొందరపాటు తగదు.. అనంతగిరి లో అందుబాటులోకి వచ్చిన ఏకలవ్య పాఠశాల

తాళపత్ర గ్రంథాలను విడుదల విడుదల చేసిన

Select Suryaa Now
తాళపత్ర గ్రంథాలను విడుదల  విడుదల చేసిన


డాన్ బాస్కో కాలేజీ కరస్పాండెంట్ వి బాలశౌరి 
ఉత్తరాంధ్రాకే పేరుగాంచిన గ్రంథాలయం నర్సీపట్నం... గ్రంథాలయ చైర్మన్ సతీష్ కుమార్ 

నర్సీపట్నం నవంబరు 14 మేజర్ న్యూస్ :
గ్రంథాలయాల  వారోత్సవాల భాగంగా రెండవ రోజు శాఖా గ్రంధాలయం నర్సీపట్నం నందు పుస్తక ప్రదర్శనను గ్రంధాలయ అధికారిని పి దమయంతి  నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాన్ బాస్కో కాలేజీ కరస్పాండెంట్ వి బాలశౌరి గారు పుస్తక ప్రదర్శన ఫ్లెక్సీని ఆవిష్కరించారు. ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెం రెడ్డి సతీష్ కుమార్ గారు రిబ్బన్ కట్ చేసి పుస్తక ప్రదర్శనను  ప్రారంభించారు. ప్రదర్శనకు ఉంచిన పుస్తకాలను, తాళపత్ర గ్రంథాలను తిలకించారు. డాన్ బాస్కో కాలేజీ  నుంచి వచ్చిన విద్యార్థులు  పెద్ద సంఖ్యలో పుస్తక ప్రదర్శనను తిలకించారు.  అనంతరం జరిగిన సభలో డాన్ బాస్కో కాలేజీ ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ J.ఉపేంద్ర మాట్లాడుతూ గ్రంధాలయాలను ఉపయోగించుకొని యువత ముందుకు సాగాలని అన్నారు. డాన్ బోస్కో కాలేజీ రెక్టర్ మరియు  కరస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ V.బాలశౌరి  గారు మాట్లాడుతూ ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులకు సమానమని అన్నారు. గ్రంథాలయాలు జ్ఞానానికి నిధి అని, మనం ఎంతైనా జ్ఞానం సంపాదించుకో వచ్చని  ఇంత చక్కటి గ్రంథాలయం మనకు అందుబాటులో ఉండడం ఎంతో సంతోషమని అన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి. కుమార్ రాజు మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాల్లో మాత్రమే కాకుండా మిగతా రోజుల్లో కూడా గ్రంధాలయాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెం రెడ్డి. సతీష్ కుమార్ గారు మాట్లాడుతూ యువత మరింత ఎక్కువగా గ్రంథాలయానికి వచ్చే విధంగా గ్రంథాలయాలను తీర్చిదిద్దుతామని, కూటమి ప్రభుత్వం  గ్రంధాలయల అభివృద్ధికి ఎంతో సహకరిస్తుందని అన్నారు. ప్రతి గ్రామంలో పుస్తక నిక్షిప్త  కేంద్రం ఏర్పాటు చేసి యువతకు అందుబాటులో ఉంచుతామని అన్నారు. పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను ఇప్పటికే అందుబాటులో ఉంచామని అన్నారు. ఉత్తరాంధ్రలోనె నర్సీపట్నం శాఖ గ్రంథాలయాన్ని చక్కగా నిర్వహిస్తున్నారని గ్రంథాలయ అధికారిని అభినందించారు. మొదటిసారిగా స్థానిక కూటమీ నాయకులు పాల్గొన్నారు. పాఠకులు యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పుస్తక ప్రదర్శనను తిలకించారు. ప్రారంభ సమయంలో విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు పి. ప్రభాకర్ అతిథులకు స్వాగతం పలికారు. దమయంతి దంపతులు చేతుల మీదుగా అతిథులకు సన్మాన కార్యక్రమం జరిగింది. దమయంతి గారి వందన సమర్పణతో  కార్యక్రమం ముగిసింది.