BREAKING
ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఘన సత్కారం.. ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డిపిఓ. ఎంపీడీవో డిప్యూటీ ఎంపీడీవో సాలూరు రైలు బండిని పునరుద్ధరించండి కశ్మీర్ లోయ, చీనాబ్ వ్యాలీలో వరుస ఉగ్రదాడులు: భద్రతా బలగాల విజయాలకు ఎదురైన కొత్త సవాల్! తొలి రోజు నామినేషన్లకు స్పందన దశదిన కర్మ కు హాజరైన సర్పంచ్.. బండి స్వామి పీఎస్ఎల్వీ రీ-ఎంట్రీపై తొందరపాటు తగదు.. అనంతగిరి లో అందుబాటులోకి వచ్చిన ఏకలవ్య పాఠశాల

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం చేసి...

Select Suryaa Now
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం చేసి...

 

మానవత్వం చాటుకున్న గుర్రాజుపేట రామరాజు

ఎస్.రాయవరం, నవంబర్ 15, మేజర్ న్యూస్:
ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల స్మారక దినోత్సవం రోజున మానవత్వాన్ని చాటే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 
ఎస్.రాయవరం మండలంలోని కొత్త పోలవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుర్రాజుపేట గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై, ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే!

'మనసున్న మారాజు' సాగి రామరాజు!
ప్రమాదం జరిగి రెండు రోజులు గడిచినా, బాధిత కుటుంబాల కన్నీరు ఆరలేదు. ఈ నేపథ్యంలో అదే గుర్రాజుపేట గ్రామానికి చెందిన, దాతృత్వానికి మారుపేరైన 'సాగి' వారి కుటుంబీకులు సాగి రామరాజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మృతుల కుటుంబాలను తక్షణమే ఆదుకున్నారు.  గ్రామ మాజీ సర్పంచ్ కురందాసు శ్రీనివాస్ తో కలిసి బాధిత కుటుంబాల ఇళ్లకు స్వయంగా వెళ్లి, మృతి చెందిన ముగ్గురు యువకుల కుటుంబాలకు కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున అత్యవసర ఆర్థిక సాయాన్ని అందజేశారు.

వేగం కన్నా ప్రాణం ముఖ్యం... మాజీ సర్పంచ్ కురందాసు శ్రీనివాస్
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన యువత నిద్దేశించి గుర్రాజుపేట మాజీ సర్పంచ్ కురందాసు శ్రీనివాస్ మాట్లాడుతూ,
కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, క్షేమంగా ఇంటికి చేరడం ముఖ్యం. వేగం కన్నా ప్రాణం విలువైనది. ఈ విషాదం మరే కుటుంబానికి రాకూడదు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో మానవత్వం చాటిన సాగి రామరాజు కి గ్రామం తరపున కృతజ్ఞతలు అని తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకున్న సాగి రామరాజు సేవా నిరతిని గ్రామస్తులు అభినందిస్తున్నారు.