పి.బాలారం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం.
నర్సీపట్నం నవంబర్ 14 మేజర్ న్యూస్ :
పిల్లలలో ఉన్న సృజనాత్మకతను పెంపొందించడానికి బాలల దినోత్సవం ఒక వేదిక అని పిల్లల్లో ఉన్న ప్రతిభ ను వెలికి తీసే చక్కని కార్యక్రమం అని ప్రధానఉపాధ్యాయుడు పి ఆర్ టి యు మండల అధ్యక్షులు వేంపాటి తలుపులు అన్నారు. పి.బాలారం పాఠశాలలో బాలల దినోత్సవం వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు తలుపులు మాస్టారు మాట్లాడుతూ పిల్లలలో
మనం పెంచే సృజనాత్మకత మన దేశ భవిష్యత్తుకు నాంది అని తెలిపారు..మన దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నవంబర్ 14, జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులు అందరికీ అభినందనలు తెలిపారు .నేటి బాలలే రేపటి పౌరులు.వారిలో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, నైపుణ్యాలను పెంపొందించేలా ప్రోత్సహించడం మనందరి బాధ్యత.బాలల విద్య, ఆరోగ్యం, భద్రత, సమగ్ర అభివృద్ధికి అవకాశాలను వారి ఉజ్వల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి. చిన్నారుల అభ్యున్నతితోనే రాష్ట్రం, దేశం మరింత పురోగతి సాధిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యక్షురాలు అప్పన నాగమణి పిల్లలందరికీ చాక్లెట్స్, బిస్కెట్స్ పంచి ఉన్నారు ప్రధానోపాధ్యాయులు పిఆర్టీయు అధ్యక్షులు వేంపాటి తలుపులు, పి ఆర్ టి యు గౌరవ అధ్యక్షులు కుంచె మురళి, యస్.నూకరత్నం పాల్గొన్నారు.