అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
పరకాల, మేజర్ న్యూస్, అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.ఆదివారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హాజరై అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్ మంజూరి పత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర అర్హులైన పేదలకు చేయూత పింఛన్లు అందించడం ద్వారా వారి జీవితాల్లో ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం, సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ పాలన కొనసాగుతోందని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు అభివృద్ధి పేరుతో దోచుకున్నారని, పింఛన్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అర్హులకు ప్రభుత్వం అండగా నిలుస్తూ నూతన పింఛన్లు మంజూరు చేయడం సంతోషకరమని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని తెలిపారు.నూతన పింఛన్లు అందుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్ పర్సన్ పావుశెట్టి సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ పాలకవర్గం, గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారు పాల్గొన్నారు.
రిపోర్టర్: బి సుజాత, పరకాల హనుమకొండ జిల్లా