BREAKING
19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక శ్రీనివాసపురంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. – వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ లావణ్య .మల్లవరంలో జెడ్పీటీసీ హర్షిత్‌రెడ్డికి పౌరసన్మానం! 450 ఓట్ల మెజారిటీ అందించిన గ్రామానికి రుణపడి ఉంటా – తుమ్మలగుంటతో సమానంగా సి.మల్లవరాన్ని అభివృద్ధి చేస్తా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఘాట్ రోడ్డులో యథావిధిగా వాహనాల రాకపోకలు నినాదాలు కాదు..పిల్లల వర్తమానానికి భరోసా కావాలి! శ్రీ జ్ఞాన జ్యోతి పాఠశాలలో అంబరాన్నంటిన బాలల దినోత్సవ వేడుకలు! ఎల్.ఆర్.జి పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బాలోత్సవం, వార్షికోత్సవం పద్మనాభపురం కాలనీలో చైర్మన్ గంగాభవాని పర్యటన. మధుమేహంపై ప్రతి ఒక్కరూ అవగాహన అవసరం.. జగన్, ఆయన కుటుంబంపై సైబర్ దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి పాత పింఛను విధానానికి దరఖాస్తుల ఆహ్వానం.... గురుకులాల్లో ఘనంగా బాలల దినోత్సవం.. ‘ బాక్సాఫీస్ వద్ద రామాయణ సునామీ.. పది రోజుల్లోనే ₹670 కోట్ల మార్క్ దాటిన రణ్‌బీర్ కపూర్, యశ్ చిత్రం రాష్ట్రస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్‌కు ఏడు ప్రాజెక్టుల ఎంపిక

నినాదాలు కాదు..పిల్లల వర్తమానానికి భరోసా కావాలి!

Select Suryaa Now
నినాదాలు కాదు..పిల్లల వర్తమానానికి భరోసా కావాలి!



అరకులోయ, నవంబర్ 14, మేజర్ న్యూస్:
​బాలల దినోత్సవం కేవలం ఒక్కరోజు వేడుకలకే పరిమితం కాకూడదని అల్లూరి సీతారామరాజు జిల్లా గిరి బాల నేస్తం కన్వీనర్ వి.వి.జయ పేర్కొన్నారు.మండలంలోని చొంపి గిరిజన గ్రామంలో ఆసరా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో గిరి బాల నేస్తం బాలల దినోత్సవ వేడుకలను శనివారం నిర్వహించింది.ఈ సందర్భంగా బాలల దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లూరి జిల్లా గిరి బాల నేస్తం కన్వీనర్ వి.వి.జయ మాట్లాడుతూ బాలల దినోత్సవాన్ని నినాదాలతో కూడిన వేడుకలకే పరిమితం చేయకుండా చిన్నారుల వర్తమానానికి భరోసా ఇచ్చేలా చూడాలన్నారు.పిల్లలే దేశ భవిష్యత్తు అని వేదికలపై ప్రసంగాలు చేసి చేతులు దులుపుకోవడం కాదని, వారికి వర్తమానంలోనే సురక్షితమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడం ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.నవంబర్ 14 వ తేదీ రాగానే విద్యాసంస్థలు రంగులమయం కావడం, చిన్నారులకు ఆటపాటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రధానం చేయడం ఆనవాయితీగా వస్తోందని, అయితే క్షేత్రస్థాయిలో పిల్లల వాస్తవ జీవన పరిస్థితులపై ఎంతవరకు శ్రద్ధ చూపుతున్నారనేదే అసలు ప్రశ్న అని ఆమె చెప్పారు.
​గిరిజన ప్రాంతాల్లో రక్తహీనత,పోషకాహార లోపంతో వేలాదిమంది ఇబ్బందులకు గురవుతున్న దృష్ట్యా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించాలని ఆమె కోరారు.అదేవిధంగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గణాంకాల ప్రకారం, దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో 19 శాతం మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఆమె తెలిపారు.ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో నేటికీ పరిస్థితులు మారలేదని, పౌష్టికాహార లోపంతో గిరిజన చిన్నారుల్లో రక్తహీనత తీవ్రంగా పెరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
​ఆటలు ఆడుకోవాల్సిన వయస్సులో పనులు చేయడం, చదువుకోవాల్సిన వయస్సులో కుటుంబ బాధ్యతలు మోయడం అత్యంత విషాదకరమని ఆమె వాపోయారు.బాలల హక్కుల కేంద్రం విశ్లేషణ ప్రకారం 2025-26 కేంద్ర బడ్జెట్‌లో బాలల కోసం కేటాయించిన నిధుల వాటా కేవలం 2.29 శాతం మాత్రమే ఉండటం దయనీయమని,ఈ పరిస్థితిలో తక్షణమే మార్పు రావాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనను​కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో బాలల సంక్షేమానికి కేటాయింపులను గణనీయంగా పెంచాలని,
​గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలు,అంగన్‌వాడీ కేంద్రాలు,బాలల రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసి రక్తహీనత నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వి.వి. జయ డిమాండ్ చేశారు. 
​అంతకుముందు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చొంపి గిరిజన గ్రామంలోని చిన్నారులందరికీ ఆట, పాటల పోటీలను ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.ఈపోటీల్లో గెలుపొందిన చిన్నారులకు, పోటీల్లో పాల్గొన్న పిల్లలందరికీ ఆసరా చారిటబుల్ సొసైటీ సౌజన్యంతో గ్రామ పెద్దల చేతుల మీదుగా బహుమతులు,ప్రశంసా పత్రాలు (సర్టిఫికెట్లు) అందజేశారు.
​ఈ కార్యక్రమంలో ఎస్. నాగేంద్ర,గ్రామ ప్రెసిడెంట్ సుభద్ర,జీనబంధు,గ్రామ పెద్దలు మల్లేష్,సుజాత, పద్మ,మనీషా,గ్రామస్తులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.