19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక
తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :
తిరుపతి రూరల్ మండల ప్రజా పరిషత్ కో ఆప్షన్ నెంబర్ ఎన్నిక ఈనెల 19వ తేదీ జరగనున్నట్లు తిరుపతి రూరల్ మండలం ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ పి యశ్వంత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే అదే రోజున తిరుపతి రూరల్ మండలంలో నూతనంగా ఎన్నికైన ఎంపిటిసి లతో సమావేశమై మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక కూడా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 19 వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు ముత్యాల రెడ్డి పల్లి లోని ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతుందని తెలిపారు. అదే రోజు ఉదయం 10 గంటలకు కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక కోసం నామినేషన్ల స్వీకరణ, 12 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించడం,ఒంటిగంటకు ఎంపిక చేయడంతో పాటు ప్రమాణ స్వీకార మహోత్సవం, మూడు గంటలకు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక ప్రమాణస్వీకారం నిర్వహించనున్నట్లు రిటర్నింగ్ అధికారి యశ్వంత్ తెలిపారు.
H. Dwaraka, staff reporter
9705347341