BREAKING
19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక శ్రీనివాసపురంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. – వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ లావణ్య .మల్లవరంలో జెడ్పీటీసీ హర్షిత్‌రెడ్డికి పౌరసన్మానం! 450 ఓట్ల మెజారిటీ అందించిన గ్రామానికి రుణపడి ఉంటా – తుమ్మలగుంటతో సమానంగా సి.మల్లవరాన్ని అభివృద్ధి చేస్తా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఘాట్ రోడ్డులో యథావిధిగా వాహనాల రాకపోకలు నినాదాలు కాదు..పిల్లల వర్తమానానికి భరోసా కావాలి! శ్రీ జ్ఞాన జ్యోతి పాఠశాలలో అంబరాన్నంటిన బాలల దినోత్సవ వేడుకలు! ఎల్.ఆర్.జి పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బాలోత్సవం, వార్షికోత్సవం పద్మనాభపురం కాలనీలో చైర్మన్ గంగాభవాని పర్యటన. మధుమేహంపై ప్రతి ఒక్కరూ అవగాహన అవసరం.. జగన్, ఆయన కుటుంబంపై సైబర్ దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి పాత పింఛను విధానానికి దరఖాస్తుల ఆహ్వానం.... గురుకులాల్లో ఘనంగా బాలల దినోత్సవం.. ‘ బాక్సాఫీస్ వద్ద రామాయణ సునామీ.. పది రోజుల్లోనే ₹670 కోట్ల మార్క్ దాటిన రణ్‌బీర్ కపూర్, యశ్ చిత్రం రాష్ట్రస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్‌కు ఏడు ప్రాజెక్టుల ఎంపిక

.మల్లవరంలో జెడ్పీటీసీ హర్షిత్‌రెడ్డికి పౌరసన్మానం! 450 ఓట్ల మెజారిటీ అందించిన గ్రామానికి రుణపడి ఉంటా – తుమ్మలగుంటతో సమానంగా సి.మల్లవరాన్ని అభివృద్ధి చేస్తా

Select Suryaa Now
.మల్లవరంలో జెడ్పీటీసీ హర్షిత్‌రెడ్డికి పౌరసన్మానం!  450 ఓట్ల మెజారిటీ అందించిన గ్రామానికి రుణపడి ఉంటా  – తుమ్మలగుంటతో సమానంగా సి.మల్లవరాన్ని అభివృద్ధి చేస్తా

తిరుపతి రూరల్‌, మేజర్ న్యూస్ :
జెడ్పీటీసీ ఎన్నికల్లో తనకు ఘన విజయాన్ని అందించిన సి.మల్లవరం పంచాయతీ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తిరుపతి రూరల్‌ జెడ్పీటీసీ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి అన్నారు. మండలంలోని సి.మల్లవరం పంచాయతీ గాంధీనగర్‌లో శనివారం ఆయనకు ఘనంగా పౌరసన్మానం నిర్వహించారు. మాజీ సర్పంచ్‌ మొక్కల భారతి, వైఎస్సార్‌సీపీ నేత మొక్కల తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు గజమాలలు వేసి, పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా హర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ.. తన రాజకీయ విజయానికి తొలి అడుగు సి.మల్లవరం నుంచే పడిందన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో 450 ఓట్లకు పైగా మెజారిటీ అందించి తన విజయానికి బాటలు వేసిన గ్రామ ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మరువలేనన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి జిల్లా పరిషత్‌ నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడతానని హామీ ఇచ్చారు. తుమ్మలగుంటతో సమానంగా సి.మల్లవరం పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే మళ్లీ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని గెలిపించాలని, జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని పిలుపునిచ్చారు. చంద్రగిరి నియోజకవర్గంలోనే అతిపెద్ద మండలమైన తిరుపతి రూరల్‌లో 1.72 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచి తమ అభిమానాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించిందని, పథకాల్లో కోతలు విధిస్తూ వివిధ వర్గాల వారిని అనర్హులుగా ప్రకటించడంతో పేదల జీవితాల్లో ఇబ్బందులు నెలకొన్నాయని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాలకు సంక్షేమ పథకాలు అందడంతోపాటు పల్లెల్లో అభివృద్ధి పనులు వేగవంతం కావాలంటే వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి రావాలన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను గెలిపించాలని, అప్పుడే గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా ఉంటుందని అన్నారు.మాజీ సర్పంచ్‌ మొక్కల భారతి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబంపై ప్రజలకు ఉన్న అభిమానానికి హర్షిత్‌రెడ్డి విజయం నిదర్శనమన్నారు. ఎన్నికల్లో టీడీపీ నాయకులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజల మద్దతుతో ఆయన విజయాన్ని అడ్డుకోలేకపోయారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఎక్కడ జరిగినా ప్రజలు జగనన్న వైపే ఉన్నారని అన్నారు. ఈ
కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.