మధుమేహంపై ప్రతి ఒక్కరూ అవగాహన అవసరం..
- పోలాకి పీహెచ్‌సీలో ప్రపంచ మధుమేహ దినోత్సవ అవగాహన సదస్సు..
నరసన్నపేట నవంబర్ 14 మేజర్ న్యూస్:
ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో జన చేతన ఎన్జీవో, పాలకొండ వారి సహకారంతో మధుమేహ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ నల్లి రవికుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుత యాంత్రిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా మధుమేహం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ (CGM) విధానం ద్వారా శరీరంలో గ్లూకోజ్ స్థాయిల్లో చోటుచేసుకునే మార్పులను నిరంతరం పర్యవేక్షించుకోవచ్చని వివరించారు. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు గుర్తించి, వైద్యుల సూచనల మేరకు తగిన చికిత్స తీసుకోవడంతో పాటు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చని తెలిపారు.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా మధుమేహ ముప్పును తగ్గించుకోవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో మోహిని, లక్ష్మి, నాగమణి, కృష్ణవేణి, తులసి, లక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు