BREAKING
ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం 19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక శ్రీనివాసపురంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. – వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ లావణ్య .మల్లవరంలో జెడ్పీటీసీ హర్షిత్‌రెడ్డికి పౌరసన్మానం! 450 ఓట్ల మెజారిటీ అందించిన గ్రామానికి రుణపడి ఉంటా – తుమ్మలగుంటతో సమానంగా సి.మల్లవరాన్ని అభివృద్ధి చేస్తా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఘాట్ రోడ్డులో యథావిధిగా వాహనాల రాకపోకలు

తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి

Select Suryaa Now
తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి

ఖిలా వరంగల్ , మేజర్ న్యూస్,
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ఉద్యమించిన ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని అట్టి ఆందోళన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉద్యమకారు ల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి ప్రభుత్వాన్ని హెచ్చరించినారు శనివారం రోజున ఉర్సులో ప్రభుత్వం ప్రకటించిన హామీలతో కూడిన వినతిపత్రంలను వరంగల్ మహా నగర పాలక సంస్థ పారిశుద్ధ ట్రాక్టర్ కు అందజేసినారు మరుపల్ల రవి మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉద్యమకారులకు హామీలు  ఇచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా అర్హులైన ఉద్యమకారు లకు ప్రతి ఒక్కరికి 250 గజముల ఇంటి స్థలము ప్రతినెల 25 వేల రూపాయల పెన్షన్లు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యమకార్ల సంఘం ఆధ్వర్యంలో అనేక సార్లు ప్రభుత్వ అధికారులకు ప్రజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి కార్యాలయమునకు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు వినతి పత్రం ఇచ్చిన దరఖాస్తు వినతిపత్రంలను అమలు పరచక బుట్ట దాఖలు చేసినందుకు నిరసనగా వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో రాసిన కాగితాలను చెత్తాచెదారం తీసుకెళ్లే పారిశుద్ధ్య ట్రాక్టర్ సిబ్బందికి అందజేసినారు ఇట్టి కార్యక్రమంలో ఉద్యమకారులు మేకల ఎల్లయ్య నాగవెల్లి సాంబయ్య అంకం దేవానంద్ మాడిశెట్టి రాజకుమార్ ముసినిపల్లి జమున కొడి పాక రమాదేవి చిదురాల సుజాత సోమ ఉపేంద్ర కొండపాక లక్ష్మి లు ఉన్నారు

రిపోర్టర్; శ్రీనివాస్, కిలా వరంగల్ , వరంగల్ జిల్లా