BREAKING
జిల్లా ఆసుపత్రిలో డబ్బులు అడిగితే ఫోన్ చేయండి – ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండ శ్రీధర్ నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం న్యాయవాద పరిషత్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త సేవల అంతరాయంపై ట్రంప్ అధికారి వ్యంగ్యాస్త్రాలు: H-1B వీసా నియామకాలను ప్రస్తావిస్తూ విమర్శ నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’ ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన దిశగా భారత్ దూకుడు.. శీతాకాల సమావేశాల్లో ఎంఎస్ఎంఈ, లాజిస్టిక్స్ రంగాలపై తొలి ఇంటిగ్రేటెడ్ ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టనున్న కాగ్ నూతన అడ్వకేట్ బండారి రవికి ఘన సన్మానం... రైతులకు అండగా ఉంటాం మాజీ చైర్మన్ కాంటే కార్ మధుమోహన్ ఆసియాలో టాప్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి గమ్యస్థానంగా అవతరించిన భారత్: 5.5 బిలియన్ డాలర్ల నిధుల ప్రవాహం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: తుది అడ్డంకులపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర స్పందన ఆధునిక నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరోసిటీలో ఘనంగా ‘అవెనీర్–2026’ వార్షిక క్రీడోత్సవం మాక్ గ్రామ సభ నిర్వహించిన చిన్నారులకు బహుమతి అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ క్రమశిక్షణ పట్టుదల తో లక్ష్యాలు సాధించాలి

నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’

Select Suryaa Now
నిరుద్యోగ మహిళలకు భరోసా  -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’

 

 

సూర్య - పెద్దపల్లి:
నిరుద్యోగ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి,వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ నెల 22న  పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్ సింధూర ఐటీఐ కాలేజీ క్యాంపస్‌లో భారీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష వెల్లడించారు.సురక్ష మ్యాన్‌పవర్ సర్వీసెస్,ఫిట్ అండ్ ఫ్యూచర్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న ఈ జాబ్ మేళాకు తాను ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు ఆమె తెలిపారు.ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ హైదరాబాద్ కొంగరకలాన్‌లోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీలలో వేలాది ఉద్యోగ అవకాశాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.18 నుండి 45 సంవత్సరాల వయసు కలిగి ఎస్ఎస్‌సీ,ఇంటర్మీడియట్, ఐటీఐ,డిప్లొమా,డిగ్రీ,బీటెక్ పూర్తి చేసిన తెలంగాణ ఆడబిడ్డలందరూ ఈ జాబ్ మేళాకు అర్హులని వివరించారు.ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,851 గ్రాస్ జీతం ఈఎస్ఐ, పీఎఫ్ మినహాయింపుల తర్వాత చేతికి వచ్చే నికర వేతనం రూ.17,650 చెల్లించడంతో పాటు హైదరాబాద్‌లో ఎక్కడి నుండైనా ఉచిత ఏసీ బస్సు సౌకర్యం,పూర్తి భద్రత, మధ్యాహ్నం మరియు రాత్రి రెండు పూటలా ఉచిత భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ మహిళలు బృందాలుగా తరలివచ్చి ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దాసరి ఉష పిలుపునిచ్చారు.ఆసక్తి గల అభ్యర్థులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య 9240954734 నంబర్‌కు ఫోన్ చేసి లేదా పోస్టర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె సూచించారు.