మాక్ గ్రామ సభ నిర్వహించిన చిన్నారులకు బహుమతి అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్
శాయంపేట, మేజర్ న్యూస్,
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ గజ్జి ఐలయ్య,ఉప సర్పంచ్, తుడుం రాజు హాజరై చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం పాఠశాల కార్యదర్శి రాజారాం ఆధ్వర్యంలో విద్యార్థులతో మాక్ గ్రామసభ నిర్వహించారు. పిల్లలు సర్పంచ్ గా, ఉప సర్పంచ్ గా, వార్డు మెంబర్లుగా, కార్యదర్శిగా ఏర్పడి గ్రామంలో రోడ్లు, మంచినీరు, పాఠశాల అభివృద్ధి, పారిశుద్ధ్యం గురించి చక్కగా చర్చించారు. చిన్నారులు మాట్లాడిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోయి చప్పట్లు కొట్టారు.
అనంతరం సర్పంచ్ గజ్జి ఐలయ్య మాట్లాడుతూ మన దేశ మొదటి ప్రధానమంత్రి, పిల్లల చాచా జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం. ఆయనకు పిల్లలంటే ఎంతో ప్రేమ. అందుకే ఆయన పుట్టినరోజును మనం బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 'నేటి బాలలే రేపటి పౌరులు' అని ఆయన చెప్పారు. ఆ ఆశయాన్ని మనం కొనసాగించాలి.మన పత్తిపాక పిల్లలు కూడా బాగా చదువుకొని, క్రమశిక్షణతో పెరిగి రేపు గ్రామానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలి. పిల్లల చదువు కోసం గ్రామ పంచాయతీ ఎప్పుడూ అండగా ఉంటుంది" అని అన్నారు.అనంతరం మాక్ గ్రామసభను చక్కగా నిర్వహించిన విద్యార్థులకు, పాల్గొన్న చిన్నారులందరికీ సర్పంచ్, ఉప సర్పంచ్ చేతుల మీదుగా బహుమతిగా పెన్నులు, గిఫ్టులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాధవి, శ్రీనివాస్, ఉపాధ్యాయులు అంజని,షేక్ చాను పాషా, అనిత, విజయ,రఘు, సోంబాబు శర్మ, రమాదేవి, కిరణ్మయి,విజయ్ కుమార్, అంగన్వాడీ టీచర్లు రమాదేవి, స్వప్న,చంద్రకళ, విద్యార్థులు,వార్డు మెంబర్లు,గ్రామస్తులు తదితరులు.
రిపోర్టర్ ;రమేష్, శాంపేట, హనుమకొండ జిల్లా