BREAKING
ఆధునిక నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరోసిటీలో ఘనంగా ‘అవెనీర్–2026’ వార్షిక క్రీడోత్సవం మాక్ గ్రామ సభ నిర్వహించిన చిన్నారులకు బహుమతి అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ క్రమశిక్షణ పట్టుదల తో లక్ష్యాలు సాధించాలి నెహ్రూ ఘన నివాళి కౌన్సిలర్లకు ఘన సన్మానం నూతన ఎస్సై తిరుపతిని మర్యాదపూర్వకంగా కలిసిన కొడకండ్ల మండల ప్రెస్ క్లబ్ సభ్యులు విశ్రాంతి గది నిర్మాణానికి రూ 10 లక్షలు విరాళం బాలల అభిప్రాయాలకు గౌరవిస్తూ వారి సమస్యలను పరిష్కరిద్దాం ఇమాంపూర్ గ్రామంలో భారీ వాహనాల బీభత్సం బాలాజీ కుటుంబానికి శ్రీ రాజ్య తండా నాయకుల పరామర్శ విద్యార్థులు గ్రంధాలయాలు సద్వినియోగం చేసుకోవాలి అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం... ఇద్దరిపై కేసు గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

నెహ్రూ ఘన నివాళి

Select Suryaa Now
నెహ్రూ ఘన నివాళి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంకడియం మండలం బుర్రిలంక గ్రామంలో కాంగ్రెస్ కార్యాలయంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 137 జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ రూరల్ కోఆర్డినేటర్ తాడాల కొండరాజు నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. పిల్లలంటే నెహ్రూకు ఎంతో ఇష్టమని, అందుకే ఆయన జయంతిని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. బాలలే దేశ భవిష్యత్తు అని, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. పిల్లల ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారి ఉజ్వల భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేటి బాలలే రేపటి పౌరులంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కడియం మండల కాంగ్రెస్ అధ్యక్షులు పిఎస్ఎన్ రాజు తీగిరెడ్డి నాగబాబు తీగి రెడ్డి ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.