కౌన్సిలర్లకు ఘన సన్మానం
డోన్, రూలర్ మేజర్ న్యూస్: డోన్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన 33వ వార్డు కౌన్సిలర్ రేష్మతో పాటు, ఎన్నికల్లో పోటీ చేసిన ఖాజాబీని దూదేకుల యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. స్థానిక హ్యాంగ్‌అవుట్ ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసిన అభినందన సభలో సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఇటీవలి పురపాలక ఎన్నికల్లో తమ సామాజిక వర్గానికి చెందిన వారు పోటీ చేసి విజయం సాధించడం ఆనందదాయకమన్నారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే దూదేకుల సామాజిక వర్గ అభ్యర్థులకు యువజన సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. సమిష్టి కృషి, ఐక్యతతో ముందుకు సాగుతూ సామాజిక వర్గ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని, రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైల్వే టీసీ మదర్‌సాబ్, జూనియర్ ఫారెస్ట్ అధికారి మౌలాలి, డాక్టర్ మౌలాలి, హుమయూన్, జనసేన మౌలాలి, బీఈడీ బాషా, దాదా బాషా, ఇద్రూస్, వలి, రజాక్, దస్తగిరితో పాటు పట్టణ దూదేకుల సంఘం నాయకులు, యువత పాల్గొన్నారు.