BREAKING
పూజ కోసం కొమ్మలు కోస్తూ చెరువులో పడి వృద్ధుడు మృతి కీసర ఓఆర్ఆర్ రేడియల్ రోడ్డు లో అక్రమ నిర్మాణాల జోరు...! కాలుష్య రహిత సమాజం కోసం చిన్నారుల బృహత్తర సంకల్పం.. గ్రీన్ వారియర్ అవార్డులతో సత్కారం! ఏఐ, వీఎఫ్ఎక్స్ విమర్శలకు చెక్ పెట్టాలంటే ఇదే మార్గం.. నాగార్జున కీలక సూచన పాత బట్టల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బట్టల నిల్వలు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి కాకా సినిమా స్పెషల్ సాంగ్‌లో రితికా సింగ్.. మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ అల్లు అర్జున్ బోయపాటి కాంబినేషన్‌లో మరో సినిమా.. మైథలాజికల్ కథతో పాన్ ఇండియా ప్రాజెక్ట్? గౌతమ్‌తో ప్రేమకథపై కాజల్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. పెళ్లి వెనుక అసలు నిజం ఇదే నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన పోలీసులు కేసరి సీతమ్మ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు భీమవరం విద్యాచరిత్రలో సువర్ణాధ్యాయం ‘విష్ణు విమెన్స్ యూనివర్సిటీ --కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ --మంత్రులు శ్రీనివాస్ వర్మ లోకేష్ కృషితో యూనివర్సిటీ ఏర్పాటు -- అత్యుత్తమ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తాం : చైర్మన్ విష్ణు రాజు పాత వేమవరంలో టీడీపీలోకి జనసేన నాయకుడి చేరిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న మాదల వీరయ్య చౌదరి ఇందిరమ్మ ఇంటి కల సహకారం మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ కమల్ హాసన్‌తో నాటి పుకార్లపై జయసుధ స్పష్టత.. అసలు నిజం బయటపెట్టిన సహజ నటి

అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం... ఇద్దరిపై కేసు

Select Suryaa Now
అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం... ఇద్దరిపై కేసు

భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, భీమదేవరపల్లి మండలం వంగర గ్రామ శివారులో అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు వచ్చిన సమాచారంతో ఆహార శుద్ధి పరిశ్రమ సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రూదాని రాముడు  వద్ద 30 జిలెటిన్‌ స్టిక్స్‌, కార్డెక్స్‌ వైర్‌, బత్తి వైర్‌ను గుర్తించారు. వీటికి సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో రూ.9 వేల విలువైన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఎల్కతుర్తి మండలం గోపాలపూర్‌కు చెందిన వల్లెపు మధు పనుల నిమిత్తం వాటిని తీసుకొచ్చినట్లు రాముడు తెలిపాడు. దీంతో రూదాని రాముడు, వల్లెపు మధుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజు వెల్లడించారు.

రిపోర్టర్; రామకృష్ణ, భీమదేవరపల్లి, హనుమకొండ జిల్లా