BREAKING
పూజ కోసం కొమ్మలు కోస్తూ చెరువులో పడి వృద్ధుడు మృతి కీసర ఓఆర్ఆర్ రేడియల్ రోడ్డు లో అక్రమ నిర్మాణాల జోరు...! కాలుష్య రహిత సమాజం కోసం చిన్నారుల బృహత్తర సంకల్పం.. గ్రీన్ వారియర్ అవార్డులతో సత్కారం! ఏఐ, వీఎఫ్ఎక్స్ విమర్శలకు చెక్ పెట్టాలంటే ఇదే మార్గం.. నాగార్జున కీలక సూచన పాత బట్టల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బట్టల నిల్వలు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి కాకా సినిమా స్పెషల్ సాంగ్‌లో రితికా సింగ్.. మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ అల్లు అర్జున్ బోయపాటి కాంబినేషన్‌లో మరో సినిమా.. మైథలాజికల్ కథతో పాన్ ఇండియా ప్రాజెక్ట్? గౌతమ్‌తో ప్రేమకథపై కాజల్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. పెళ్లి వెనుక అసలు నిజం ఇదే నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన పోలీసులు కేసరి సీతమ్మ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు భీమవరం విద్యాచరిత్రలో సువర్ణాధ్యాయం ‘విష్ణు విమెన్స్ యూనివర్సిటీ --కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ --మంత్రులు శ్రీనివాస్ వర్మ లోకేష్ కృషితో యూనివర్సిటీ ఏర్పాటు -- అత్యుత్తమ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తాం : చైర్మన్ విష్ణు రాజు పాత వేమవరంలో టీడీపీలోకి జనసేన నాయకుడి చేరిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న మాదల వీరయ్య చౌదరి ఇందిరమ్మ ఇంటి కల సహకారం మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ కమల్ హాసన్‌తో నాటి పుకార్లపై జయసుధ స్పష్టత.. అసలు నిజం బయటపెట్టిన సహజ నటి

కాలుష్య రహిత సమాజం కోసం చిన్నారుల బృహత్తర సంకల్పం.. గ్రీన్ వారియర్ అవార్డులతో సత్కారం!

Select Suryaa Now
కాలుష్య రహిత సమాజం కోసం చిన్నారుల బృహత్తర సంకల్పం.. గ్రీన్ వారియర్ అవార్డులతో సత్కారం!

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో మల్లార గ్రామంలో దీపావళికి టపాకాయలు కాల్చకుండా పర్యావరణంపై అవగాహన.. చిన్నారులను అభినందించిన సర్పంచి

కట్టంగూర్: పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని నిరూపిస్తూ ఐదుగురు చిన్నారులు ఆదర్శంగా నిలిచారు. దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చడం వల్ల కలిగే కాలుష్యాన్ని గుర్తించి, తాము వాటికి దూరంగా ఉండటంతో పాటు ఇతరులకు కూడా అవగాహన కల్పించారు. వారి సేవలను గుర్తించిన స్థానిక ప్రజాప్రతినిధులు బాలల దినోత్సవం సందర్భంగా గ్రీన్ వారియర్ అవార్డులతో సత్కరించారు.

దండెంపల్లి లక్ష్మీ ప్రసన్న, పెద్ది అక్షర-అంకిత, పెద్ది మాన్విక్, చౌగోని అభిరామ్ అక్షయ, గాదగోని మనస్విలకు గ్రామ సర్పంచి పెద్ది నాగమణి మల్లేష్ గౌడ్ అవార్డులను అందజేశారు. చిన్న వయసులోనే పర్యావరణంపై బాధ్యతాయుతమైన ఆలోచన కలిగి ఉండటం అభినందనీయమన్నారు.

అనంతరం పాఠశాలలో స్మార్ట్ టీవీ ఏర్పాటు కోసం సర్పంచి రూ.5 వేల విరాళాన్ని అందజేశారు. ప్రకృతిని కాపాడితేనే భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందించగలమని, చిన్నారుల స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి దండెంపల్లి జగదీష్ గౌడ్, హెచ్‌ఎం సమ్మేటి తిరుమలేష్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, అంగన్వాడీ టీచర్ చంద్రమ్మ, బొడ్రాయి చైర్మన్ చౌగోని లింగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.