అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి..
దుబ్బాక …దుబ్బాక మండలం నుండి నల్లగొండ లో జరుగుతున్న ఏ ఐ కె ఎస్ అఖిల భారత కిసాన్ సభల బహిరంగ సభకు బయలుదేరిన ప్రజా సంఘాల నాయకులు ఈ సందర్భంగా సి ఐ టి యు జిల్లా కోశాధికారి జి.భాస్కర్ మాట్లాడుతూ ఏ ఐ కె ఎస్ అఖిలభారత కిసాన్ సభ జాతీయ 36వ మహాసభలు నవంబర్ 15 నుండి 18వరకు నల్గొండ జిల్లా కేంద్రంలో జరగబోతున్నాయని ఈ మహాసభల సందర్భంగా నవంబర్ 15వ తేదీన నల్గొండలో లక్ష మంది రైతులతో భారీ బహిరంగ సభతో మహాసభలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఏ ఐ కె ఎస్ నిరంతరం రైతుల సమస్యలపై రైతులకు గిట్టుబాటు ధర రావాలని,నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులను నిర్మూలించి రైతులను వ్యవసాయాన్ని రక్షించాలని నిరంతరంగా దేశవ్యాప్తంగా రైతుల పక్షాన పోరాడుతున్న ఏకైక సంఘం ఏ ఐ కె ఎస్ అని తెలిపారు. దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభాలు, కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్ విధానాలు,రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. గతంలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే వాటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నెలల తరబడి రైతులు పోరాడి ఆ నల్ల చట్టాలను వెనకకు కొట్టిన చరిత్ర ఏ ఐ కె ఎస్ రైతు సంఘానికి ప్రజా సంఘాలకు ఉందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలతో దేశ ప్రజలందరినీ ధరల బారాలతో మోసం చేస్తూ కార్పొరేట్ ధనవంతులకు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ ఇస్తూ దేశాన్ని మోసం చేస్తున్నాదని హెచ్చరించారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేస్తూ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తుందని విమర్శించారు.ప్రస్తుతం దుబ్బాక ప్రాంతంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోవడం వలన రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని తెలిపారు.వీటికి తోడు విద్యుత్ కోతల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వ్యవసాయానికి ఎన్నికలకు ముందు 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తామని ప్రకటించి ఆరు,ఏడు గంటలు విద్యుత్తు మాత్రమే అందించారని విమర్శించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మేలు చేసే విధానాలను అమలు చేయాలని ఈ విధానాల కొరకు ఏ ఐ కె ఎస్ జాతీయ మహాసభలలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు.కావున నవంబర్ 15 నుండి 18 వ తేదీ వరకు నల్గొండలో జరిగే జాతీయ మహాసభల బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో రైతులు కదిలి వస్తున్నారనితెలిపారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా జిల్లా అధ్యక్షురాలు ఎస్.నవీన, ఎన్ పి అర్ డి వికలాంగుల హక్కుల జాతీయ వేధిక జిల్లా అధ్యక్షుడు ఎండి .సాజిద్, సి ఐ టి యు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.చంద్రారెడ్డి సి ఐ టి యు దుబ్బాక పట్టణ కన్వీనర్ కొంపల్లి భాస్కర్, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పర్స పద్మ, సి ఐ టి యు నాయకులు వసంత, మానస,లావణ్య, చంద్రకళా,వెంకటలక్ష్మీ, రాజు, దేవయ్య, శ్రీనివాస్, యాదగిరి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.