BREAKING
ఇందిరమ్మ ఇంటి కల సహకారం మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ కమల్ హాసన్‌తో నాటి పుకార్లపై జయసుధ స్పష్టత.. అసలు నిజం బయటపెట్టిన సహజ నటి మహిళా వర్సిటీలో ఘనంగా చిల్డ్రన్స్ డే కొత్త చెరువులో ప్లాస్టిక్ భూతం! గోవా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి అరివు చిత్రం ఎంపిక.. ఆసక్తి రేపుతున్న ప్రకటన మహారాష్ట్ర స్టేట్ స్కూల్స్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అజేయంగా నిలిచిన వీర్, హృదయ్ జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి శైలజకు ఘన సన్మానం రామాయణంలో రావణుడిగా యశ్.. ఆ అద్భుత రూపాల వెనుక ఉన్న సానియా సర్ధారియా విశేషాలు దివ్యాంగుల జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి.. గొర్రెల చోరీ నిందితుల అరెస్టు... రిమాండ్ కు తరలింపు.... కిసాన్‌ మోర్చా అధ్యక్ష బాధ్యతలు.. కృతజ్ఞతలు తెలిపిన మల్లారెడ్డి మంత్రి పొంగులేటి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ కిరణ్ మిత్ర డానియల్ మాజీ జెడ్పిటిసి సింగం సత్తయ్యను పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్ 600 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు

కిసాన్‌ మోర్చా అధ్యక్ష బాధ్యతలు.. కృతజ్ఞతలు తెలిపిన మల్లారెడ్డి

Select Suryaa Now
కిసాన్‌ మోర్చా అధ్యక్ష బాధ్యతలు.. కృతజ్ఞతలు తెలిపిన మల్లారెడ్డి

రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. పార్టీ బలోపేతమే లక్ష్యం

కీసర, మేజర్ న్యూస్ (నవంబర్, 15):

కీసర మండల బీజేపీ కిసాన్‌ మోర్చా అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించి, కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి నూతన అధ్యక్షుడు, అన్నోజిగూడకు చెందిన మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర, జిల్లా, డివిజన్‌ స్థాయి నాయకులకు, సీనియర్‌ నాయకులకు, బూత్‌ అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయం

పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని మల్లారెడ్డి పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ, కిసాన్‌ మోర్చాను మండలంలో మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.