కొత్త చెరువులో ప్లాస్టిక్ భూతం!
హుస్నాబాద్ : పట్టణంలోని కొత్త చెరువు పరిసరాలు రోజురోజుకూ చెత్తకుప్పలుగా మారుతున్నా సంబంధిత అధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువులోకి ఆహార పదార్థాల వ్యర్థాలు, పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతుండటంతో జలవనరుల పరిశుభ్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. చెరువును కాపాడాల్సిన అధికారులే చోద్యం చూస్తున్నారా? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.
చెరువులోకి చెత్త.. అధికారుల మౌనం!:
తిరుమల గార్డెన్ నుంచి వెలువడుతున్న ఆహార పదార్థాల వ్యర్థాలు, పేపర్ ప్లేట్లు తదితర చెత్తను కొత్త చెరువు పరిసరాల్లో పడేస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు పురపాలక సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కనీస స్పందన కరువైందని రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులోకి వ్యర్థాలు చేరకుండా అడ్డుకోవాల్సిన ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మంత్రి అడుగులు వేస్తుంటే.. అధికారులు నిద్రపోతున్నారా?
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతూ పర్యావరణ పరిరక్షణ దిశగా ముందుకు సాగుతుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకవైపు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పిలుపునిస్తుంటే మరోవైపు చెరువుల్లోకి ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు చేరుతున్నా పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
చర్యలు తీసుకునేందుకు ఎందుకు వెనుకడుతున్నారు?
తిరుమల గార్డెన్ వ్యవహారంపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ సంబంధిత అధికారుల నుంచి కఠిన చర్యలు కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు చెరువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత ఇరిగేషన్ పురపాలక శాఖ అధికారులపై లేదా? ప్రజల ఫిర్యాదులు అధికారుల చెవికి చేయడం లేదా? లేక తెలిసి తెలియనట్టు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కొత్తచెరువులోకి వ్యర్ధాలు చేరకుండా తక్షణ చర్యలు చేపట్టాలని చెరువు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని రైతులు స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే చెరువు పరిశుభ్రత కాగితాలకే పరిమితం అవుతుందా లేదా ఆచరణలో అమలవుతుందా అనే అంశం వేచి చూడాల్సిన అవసరం ఉందని ప్రజల్లో చర్చ నడుస్తుంది ఇక వేచి చూద్దాం పురపాలక ఇరిగేషన్ అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారు మౌనం వహిస్తారు వేచి చూద్దాం