మంత్రి పొంగులేటి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ కిరణ్ మిత్ర డానియల్
సూర్య,ఇల్లందు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆదివారం ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్ ఖమ్మం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఇల్లందు మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను మంత్రితో చర్చించారు. గతంలో ఇల్లందు అభివృద్ధికి రూ.50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేయగా, మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే ఇల్లందు మున్సిపాలిటీకి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే ఇల్లందు 1వ వార్డు, 2వ వార్డుకు సంబంధించిన ముస్లిం, మైనార్టీ స్మశాన వాటికకు, దాని చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా, మంత్రి స్పందిస్తూ కలెక్టర్ కి చెప్పి 60 లక్షలు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.
అంతేకాకుండా ఇల్లందు మున్సిపాలిటీలో పూర్తిస్థాయి రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో, రెగ్యులర్ అధికారులను నియమించాలని కోరగా, వెంటనే అధికారులను మారుస్తామని, ఇల్లందు మున్సిపాలిటీకి ఏ లోటు లేకుండా చూసే బాధ్యత తనదని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పులిగండ్ల మాధవరావు , 20వ వార్డు కౌన్సిలర్ ఎండి జాఫర్ , సీనియర్ నాయకులు పర్రె శీను, పందిళ్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ రాజేష్ ఆర్ సి