ఇందిరమ్మ ఇంటి కల సహకారం మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్
అమ్మగూడెంలో ఇందిరమ్మ గృహప్రవేశం లో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి
కనగల్ మేజర్ న్యూస్: మండలంలోని అమ్మగూడెం గ్రామపంచాయతీ చెందిన చిన్నాల నాగరాజు సమత ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూర అయింది. ఆదివారం గృహప్రవేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, స్థానిక సర్పంచ్ కొండ రవళి అంజయ్య దంపతులు నూతన గృహప్రవేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పిటిసి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందన్నారు. మొదటి విడత మంజూరైన ఇండ్లు మొత్తం దరిదాపు పూర్తయినట్లు వివరించారు. అర్హులకు చేయూత పెన్షన్ మంజూరు చేసిందన్నారు. ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందజేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉంటూ వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పగటిపాటి సత్తయ్య, మండల పరమేష్, తాటికొండ యాదయ్య, ఏడుకొండలు ,దుబ్బ గోపాల్ ,కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.