BREAKING
పాత వేమవరంలో టీడీపీలోకి జనసేన నాయకుడి చేరిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న మాదల వీరయ్య చౌదరి ఇందిరమ్మ ఇంటి కల సహకారం మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ కమల్ హాసన్‌తో నాటి పుకార్లపై జయసుధ స్పష్టత.. అసలు నిజం బయటపెట్టిన సహజ నటి మహిళా వర్సిటీలో ఘనంగా చిల్డ్రన్స్ డే కొత్త చెరువులో ప్లాస్టిక్ భూతం! గోవా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి అరివు చిత్రం ఎంపిక.. ఆసక్తి రేపుతున్న ప్రకటన మహారాష్ట్ర స్టేట్ స్కూల్స్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అజేయంగా నిలిచిన వీర్, హృదయ్ జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి శైలజకు ఘన సన్మానం రామాయణంలో రావణుడిగా యశ్.. ఆ అద్భుత రూపాల వెనుక ఉన్న సానియా సర్ధారియా విశేషాలు దివ్యాంగుల జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి.. గొర్రెల చోరీ నిందితుల అరెస్టు... రిమాండ్ కు తరలింపు.... కిసాన్‌ మోర్చా అధ్యక్ష బాధ్యతలు.. కృతజ్ఞతలు తెలిపిన మల్లారెడ్డి మంత్రి పొంగులేటి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ కిరణ్ మిత్ర డానియల్ మాజీ జెడ్పిటిసి సింగం సత్తయ్యను పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్

కమల్ హాసన్‌తో నాటి పుకార్లపై జయసుధ స్పష్టత.. అసలు నిజం బయటపెట్టిన సహజ నటి

Select Suryaa Now
కమల్ హాసన్‌తో నాటి పుకార్లపై జయసుధ స్పష్టత.. అసలు నిజం బయటపెట్టిన సహజ నటి

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: దక్షిణాది సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి జయసుధ, గతంలో కమల్ హాసన్‌తో తనపై వచ్చిన పుకార్లపై స్పందించారు. డెబ్బై, ఎనభైవ దశకాలలో తమ మధ్య ఏదో ఉందంటూ, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగిన విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. కమల్ హాసన్ తనకు మంచి మిత్రుడు మాత్రమేనని, ఆ పుకార్లలో ఎలాంటి నిజం లేదని జయసుధ తేల్చి చెప్పారు.

చిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన జయసుధ, అప్పట్లో అగ్ర కథానాయకులందరి సరసన నటించి మెప్పించారు. ముఖ్యంగా దర్శక దిగ్గజం కె. బాలచందర్ చిత్రాలలో తామిద్దరం కలిసి ఎక్కువగా పనిచేశామని, ఆ సమయంలో ఇద్దరం కలిసి వేదికలపై పాటలు కూడా పాడేవారమని ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పటి హీరోలతో పోలిస్తే కమల్ హాసన్ భిన్నమైన శైలి, నటన, నృత్యంతో ప్రేక్షకులను త్వరగా ఆకట్టుకున్నారని తెలిపారు. తాను కూడా కొత్తగా కథానాయికగా ఎంట్రీ ఇచ్చినప్పుడు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని పేర్కొన్నారు.

తాము ఇద్దరం కలిసి కనిపించినా, వేదికపై పాడినా ప్రేక్షకులు తమను చక్కని జోడీగా భావించేవారని జయసుధ చెప్పారు. పాత విషయాల గురించి ఇంటర్వ్యూలలో ప్రశ్నిస్తారని స్నేహితులు ఇంటర్వ్యూలు ఇవ్వ వద్దని సలహా ఇచ్చేవారని వివరించారు. తమ మధ్య స్నేహబంధం మాత్రమే ఉండేదని, దానిని మించి మరేమీ లేదని స్పష్టం చేశారు.

దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో కథానాయికగా, ఆ తర్వాత కీలక సహాయక పాత్రల్లోనూ జయసుధ తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సహజ నటి చేసిన వ్యాఖ్యలు మరోసారి సినీ వర్గాల్లో ఆసక్తిగా మారాయి.