బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఫ్యామిలీ వీక్.. కంటెస్టెంట్లపై హైపర్ ఆది పంచ్‌లు, కౌంటర్లు
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఫ్యామిలీ వీక్ సందడి జోరుగా సాగుతోంది. పదో వారం మొత్తం కంటెస్టెంట్ల కుటుంబ సభ్యుల రాకతో హౌస్‌లో భావోద్వేగ వాతావరణం నెలకొనగా, వీకెండ్ ఎపిసోడ్‌లో ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది తనదైన శైలిలో సందడి చేశారు. కంటెస్టెంట్ల ఆటతీరు, హౌస్‌లో జరుగుతున్న పరిణామాలపై ప్రేక్షకుల అభిప్రాయాలను తన ప్రాసలు, పంచ్‌లతో ఆది వివరించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.
గత కొన్ని సీజన్లుగా బిగ్‌బాస్ వేదికపై కనిపిస్తున్నప్పటికీ, తనకు హౌస్‌లోకి వెళ్లాలనే ఆలోచన రాలేదని, కానీ ఒక్కరోజైనా ఉంటే పదిహేను లక్షలు ఇచ్చి పంపిస్తారేమోనని అనిపిస్తోందంటూ మిథిలేష్ ఎపిసోడ్‌ను ఉద్దేశించి హైపర్ ఆది సరదాగా కౌంటర్ వేశారు. అనంతరం స్కూల్ టాస్క్‌లో త్రిగుణ్ తీరును ప్రస్తావిస్తూ, స్పైడర్ సినిమాలో ఎస్‌జే సూర్యలా కనిపించాడని, వంశీ, సుధీర్ వ్యవహార శైలిని సరదాగా పోలుస్తూ ఆటలో దూకుడు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్రిగుణ్ ఎవరికి ఎదురైనా వారికి రిస్క్ తప్పదని చమత్కరించారు.
అగ్ని పరీక్ష దాటి వచ్చినా లోపల పెట్టే పరీక్షలు వేరే ఉంటాయని షాలినీ, రోహిత్, అపూర్వ విషయంలో పరోక్షంగా వ్యాఖ్యానించిన హైపర్ ఆది, వర్షిణి, ముకేష్‌లపైనా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఆటలో సవాల్ కాదని, ఆటే సవాల్ అంటూ, ఆటలో పులిహోర కాదని, ఆటే పులిహోర అంటూ నవ్వులు పూయించారు. దేబ్జానీ, వర్షిణి మధ్య జరిగిన సంభాషణలు, టాస్క్‌ల సందర్భంగా కంటెస్టెంట్లు తమను తాము సమర్థించుకునే తీరుపైనా ఆది చురకలు అంటించారు.
పొట్టి నరేష్‌పై మాట్లాడుతూ ఇంట్లో రాత్రి వేళల్లో తండ్రిని నిద్రలేపే వ్యక్తి ఇక్కడ సుధీర్, ముకేష్‌లకు మోటివేషన్ ఇస్తున్నాడని, ఎత్తుకు తగ్గట్లు కాకుండా పెద్ద స్థాయిలో పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడంటూ సరదాగా ఎలివేట్ చేశారు. మిగతా కంటెస్టెంట్లపై హైపర్ ఆది చేసిన మరిన్ని వ్యాఖ్యలు, కౌంటర్లు పూర్తి ఎపిసోడ్‌లో చూడవచ్చని ప్రోమో ద్వారా ఆసక్తిని పెంచారు.
Also Read: రామ్ చరణ్ సినిమాలో అవకాశం.. ఆ కారణంతోనే తిరస్కరించానన్న బండి సరోజ్ కుమార్