BREAKING
*యాసంగి సాగులో పంటల మార్పిడికి రైతులు సహకరించాలి – రైతువారీ వివరాలను క్రాప్ డేటా పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి ఏఓ సతీష్ భీమవరం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా డాక్టర్ చుండూరి మల్లేశ్వరి చైర్మన్ అభ్యర్థిత్వంపై పలువురి పేర్లు ప్రచారంలోకి.. చివరకు వైద్యురాలికి జనసేన అధిష్టానం అవకాశం కవిత్వం రాయడం ఓ తపస్సు ,అమరావతి సాహితీ మిత్రులు సభలో డా. రావి రంగారావు న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా చరిత్ర.. ఒకే పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లు కైవసం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో " పుస్తక ప్రదర్శన " కీసరలో అమోర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం.. 300 మందికి పైగా వైద్య పరీక్షలు సేవ సమాజానికి స్ఫూర్తి...! -విశిష్ట సేవలందించిన వారికి సూర్యచంద్ర ఫౌండేషన్ పురస్కారాలు -అంకితభావంతో పనిచేసే వారికి గుర్తింపునివ్వడం అభినందనీయం : విసి ఉమ ఘనంగా పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ వార్షికోత్సవం పుస్తక పఠనంతోనే విజ్ఞానం వికాసం - గ్రంథాలయ అధికారి రాకేష్ అరంగేట్ర టెస్టు తొలి బంతికే అవుట్.. మహ్ఫిజుల్ ఇస్లామ్‌కు చేదు అనుభవం, రబాడ అరుదైన రికార్డు శ్రీకాళహస్తి పురపాలక సంఘం వైయస్సార్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా జ్ఞానాంబ గారి మధు రెడ్డి జనసేనలో కష్టపడిన కార్యకర్తకు గుర్తింపు కరువేనా? వలస కమలాదేవి మంచికి మారుపేరు వారిసేవలను గుర్తిస్తూ ఘనమైన నివాళులర్పించిన కూరెళ్ళ గ్రామ సర్పంచ్ బండారు లక్ష్మి బాలరాజు గ్రామ ప్రజలు న్యూజిలాండ్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా నేడే రామాలయంలో కార్తీక్ సోమవారాల వ్రతం

మౌనికశ్రీ అకాడమీ విద్యార్థులకు కె.బి.ఆర్ ప్రతిభా పురస్కారములు

Select Suryaa Now
మౌనికశ్రీ అకాడమీ విద్యార్థులకు కె.బి.ఆర్ ప్రతిభా పురస్కారములు
గుంటూరు :ఏటుకూరు రోడ్డు సూర్యదేవరపేటలోని మౌనికశ్రీ అకాడమీ విద్యార్థులు బూడేపూడి మౌనికశ్రీ (9 వ తరగతి), విష్ణుమొలకల కోమల శ్రీవల్లి (4 వ తరగతి), కోల కనిష్క (4 వ తరగతి), కోల శివ వెంకట సుక్షిత్ (2 వ తరగతి), కందుకట్ల తేజస్విని (3 వ తరగతి), కందుకట్ల జ్యోతి కార్తికేయ (యు.కే.జి) జ్ఞాపకశక్తిలో ప్రతిభ చూపినందుకు గాను అఖిల భారత ఎస్.ఓ.సి వెల్ఫేర్ అసోసియేషన్,  కె.బి.ఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 8 వ వార్షికోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం మరియు పురస్కారముల ప్రదానం గుంటూరులోని రెవెన్యూ కళ్యాణమండపంలో ఆదివారం నిర్వహించారు. ఈ విద్యార్థుల ప్రతిభను గుర్తించిన కె.బి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్, వ్యవస్థాపకులు కొడవటికంటి బాలరాజు  పురస్కారానికి ఎంపిక చేసారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సమాజ సేవకులు రక్తదానం చేసారు. సమాజ సేవకులకు, ప్రతిభ కలిగిన వారికి పురస్కారాలను అందించారు.మౌనికశ్రీ అకాడమీ విద్యార్థులు జ్ఞాపకశక్తిలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. మౌనికశ్రీ ఇప్పటి వరకు జ్ఞాపకశక్తిలో 76 రికార్డులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం, 146 జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నది. కోమలి శ్రవల్లి (తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్), కోల కనిష్క (10 జాతీయ, అంతర్జాతీయ రికార్డులు, 1 పురస్కారం), కోల శివ వెంకట సుక్షిత్ (12 జాతీయ, అంతర్జాతీయ రికార్డులు, 1 పురస్కారం), కందకట్ల తేజస్విని (తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్), కందకట్ల జ్వాలా కార్తికేయ (తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్) సాధించారు.మెమరీ ట్రైనర్ బోడెపూడి నాగస్వప్న జ్ఞాపకశక్తిలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వీరందరికీ పురస్కారములు అందుకున్నందుకు మౌనికశ్రీ అకాడమీ డైరెక్టర్ బోడెపూడి రామారావు, విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ విద్యార్థులు పురస్కారాలు అందుకోవటంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని వీరిందరితో పాటు ఇంకొంత మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఇలాంటి పురస్కారాలు అందుకోవాలని కోరుకుంటున్నారు.