BREAKING
రామగిరి పంచాయతీ టిడిపి అభ్యర్థిగా బెస్త ఆదిలక్ష్మి శ్రీనివాసులు!!! పుట్లగట్లగూడెం సర్పంచ్ అభ్యర్థిగా మల్లిపూడి రవి నామినేషన్ తాడికొండ 220కేవీ సబ్ స్టేషన్ నో సందర్శించిన జెసి. సిరాజ్ మ్యాజిక్ డెలివరీ.. ఫిన్ అలెన్ వికెట్ నేలకూల్చిన భారత పేసర్ గుర్తింపు' ఎప్పుడు... గోవిందా....! -టీటీడీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులపై కనికరం చూపండి సారూ... -ఐడీ కార్డులు, మెడికల్, లడ్డుకార్డుల జారీలో జాప్యమెందుకో... -పాలకమండలి నిర్ణయించినా అమలు చేయడంలో నిర్లక్ష్యమా...! శ్రీకాళహస్తి పురపాలక సంఘం తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థిగా పేట బాలాజీ రెడ్డి బిజెపి ఎస్టి మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు.... నిండుకుండలా ఎల్ ఎన్ డి పేట రిజర్వాయర్ --180 క్యూసెక్కులు దిగువకు విడుదల పురాతన ఆలయాకృతికి పూర్వవైభవం తీసుకురావాలి..! -- ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వన్డేల్లో జో రూట్ అరుదైన మైలురాయి.. ఇంగ్లండ్ తరఫున యాభై అర్ధశతకాలు పూర్తి ముత్యాలమ్మ దేవత నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డికి ఆహ్వానం. : కొనసాగుతున్న గ్రంధాలయ వారోత్సవాలు కరాటే క్రమశిక్షణకు పునాది... -ఆడపిల్లకు ప్రతి ఒక్కరూ తప్పక నేర్చుకోవాలి -ఘనంగా నవీన్ మార్షల్ ఆర్ట్స్ ఆరవ బ్రాంచ్ ప్రారంభం -కామన్ వెల్త్ విజేత సూర్యను శాప్ చైర్మన్ అభినందన డయాబెటిస్‌పై నిర్లక్ష్యం వద్దు..ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఎమ్మెల్యే గళ్ళా మాధవి *యాసంగి సాగులో పంటల మార్పిడికి రైతులు సహకరించాలి – రైతువారీ వివరాలను క్రాప్ డేటా పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి ఏఓ సతీష్

సేవ సమాజానికి స్ఫూర్తి...! -విశిష్ట సేవలందించిన వారికి సూర్యచంద్ర ఫౌండేషన్ పురస్కారాలు -అంకితభావంతో పనిచేసే వారికి గుర్తింపునివ్వడం అభినందనీయం : విసి ఉమ

Select Suryaa Now
సేవ సమాజానికి స్ఫూర్తి...! -విశిష్ట సేవలందించిన వారికి సూర్యచంద్ర ఫౌండేషన్ పురస్కారాలు  -అంకితభావంతో పనిచేసే వారికి గుర్తింపునివ్వడం అభినందనీయం : విసి ఉమ

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : సేవా గుర్తింపుతో సమాజానికి స్ఫూర్తిగా నిలవడం గర్వకారణమని, వివిధ రంగాలలో అంకితభావంతో పనిచేస్తూ సమాజానికి విశిష్ట సేవలందిస్తున్న వ్యక్తులను గుర్తించి పురస్కారాలతో సత్కరించడం అభినందనీయమని మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ వి.ఉమ పేర్కొన్నారు. ఏనుగు వారి సూర్యచంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సావేరి హాల్‌లో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన పలువురు వ్యక్తుల పురస్కార ప్రధానోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ఉద్యోగ విరమణ అనంతరం కూడా తనకు ప్రత్యక్ష సంబంధం లేని వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వ్యక్తులను గుర్తించి గౌరవించాలనే ఫౌండేషన్ నిర్వాహకుల సంకల్పం ప్రశంసనీయమన్నారు. ప్రస్తుత సమాజంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సాధారణ విషయం కాదని, అందుకే ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం వేదికగా నిలిచిందన్నారు. సుమారు 43 ఏళ్లుగా విశ్వవిద్యాలయ రంగంలో పనిచేస్తున్న తనకు వృత్తిపరమైన రంగాల్లో అనేక మార్పులు కనిపించాయని, నేటి రోజుల్లో వృత్తిపట్ల ప్రేమ, నిబద్ధత, అంకితభావంతో పనిచేసే వారి సంఖ్య తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొత్తం 13 విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులను గుర్తించి, వారి సేవలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అర్హులను పురస్కారాలకు ఎంపిక చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా కళాకారులకు తగిన గుర్తింపు, పురస్కారాలు లభించడం అంత సులభం కాదని, అటువంటి కళారంగానికి కూడా ప్రాధాన్యతనిస్తూ ప్రతిభావంతులను సత్కరించడం ఫౌండేషన్ ప్రత్యేకతగా పేర్కొన్నారు. పురస్కార గ్రహీతల్లో విశ్వవిద్యాలయానికి చెందిన సంగీత కళాకారిణి శైలజ రవి, నృత్య కళాకారిణి డాక్టర్ హేమబిందు ఉండటం గర్వకారణమన్నారు. సిమ్స్ డాక్టర్ వనజాక్షి వైద్యసేవలతో పాటు యోగా ద్వారా అందిస్తున్న మార్గదర్శకత్వాన్ని, గంగాధర్ ప్రకృతి వ్యవసాయ రంగంలో చేస్తున్న కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. అలాగే పోలీస్ సేవలు, అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి రజిని క్రీడారంగానికి అందించిన సేవలను, పత్రికా రంగంలో మద్దినేని చేసిన సేవలను కొనియాడారు. విభిన్న రంగాల్లో ప్రతిభను, సేవానిరతిని గుర్తించి గౌరవించడం ద్వారా మరింత మందికి స్ఫూర్తి కలుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో కుటుంబ బాధ్యతలకే పరిమితమవుతున్న పరిస్థితుల్లో తన పిల్లల పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి, సమాజంలోని వివిధ వర్గాలకు సేవలందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగు అంకం నాయుడు సంకల్పం ఆదర్శనీయమన్నారు. భవిష్యత్తులో ఆయన పిల్లలు కూడా ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ సమాజానికి తమ వంతు సహకారం అందించాలని ఆకాంక్షించారు. కళలు, వైద్యం, యోగా, ప్రకృతి వ్యవసాయం, క్రీడారంగ సేవలకు గుర్తింపుని డా.లింగుంట్ల రమేష్ నాథ్ తెలియజేశారు. పురస్కారాలు అందుకున్న వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆత్మీయ అతిథులుగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ జి.ఎస్.వి. కృష్ణమూర్తి, ఎస్వీయూ విశ్రాంత ఉపకులపతి డాక్టర్ పి.మురళి, అతిథిగా గుడివాడ నాగరత్నం నాయుడు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్