BREAKING
కల్వకుంట అంగన్వాడీలో మందుబాబుల హల్చల్ భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ.. ఐసీసీ మెగా టోర్నీల క్యాలెండర్ విడుదల శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌ బౌలర్ల పోరాటంతోనే చారిత్రక సిరీస్ విజయం.. శ్రేయస్ అయ్యర్ హర్షం గ్రంథాలయాలకు రండి.. విజ్ఞానాన్ని పెంచుకోండి పురవీధుల్లో విద్యార్థుల భారీ ర్యాలీ పూతలపట్టు గ్రంథాలయంలో ఘనంగా పుస్తక ప్రదర్శన ఘనంగా రోషిణి–గిరీష్ గౌడ్‌ల వివాహ వేడుక. కొల్చారం మండలానికి 548 నూతన పింఛన్లు మంజూరు: చీరాల వాడరేవు రోడ్ లో రోడ్డు ప్రమాదం ఒకరి పరిస్థితి విషమం క్రీడా హబ్ గా తిరుపతి -రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం -ముఖ్య అతిథిగా హాజరైన శాప్ చైర్మన్ రవి నాయుడు *విశ్రాంత జేడీ డాక్టర్ బూసి అంజయ్యకు ఘన నివాళులు* --ఉద్యోగ, వ్యాపార, రాజకీయ ప్రముఖుల సంతాపం నాన్నా చాలా టెన్షన్ అనిపించింది.. అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ అనుభవాలు పంచుకున్న ఆర్యవీర్ సెహ్వాగ్ రామగిరి పంచాయతీ టిడిపి అభ్యర్థిగా బెస్త ఆదిలక్ష్మి శ్రీనివాసులు!!! పుట్లగట్లగూడెం సర్పంచ్ అభ్యర్థిగా మల్లిపూడి రవి నామినేషన్ తాడికొండ 220కేవీ సబ్ స్టేషన్ నో సందర్శించిన జెసి. సిరాజ్ మ్యాజిక్ డెలివరీ.. ఫిన్ అలెన్ వికెట్ నేలకూల్చిన భారత పేసర్

డయాబెటిస్‌పై నిర్లక్ష్యం వద్దు..ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Select Suryaa Now
డయాబెటిస్‌పై నిర్లక్ష్యం వద్దు..ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఎమ్మెల్యే గళ్ళా మాధవి
 గుంటూరు న్యూస్ : డయాబెటిస్‌ పై ఏ మాత్రం నిర్లక్ష్యం వహించ వద్దని, చిన్న గాయం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని లేకపోతే అది కాలు తొలగించుకునే పరిస్థితులు రావచ్చని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు కొరిటెపాడు వాకింగ్ ట్రాక్‌లో నిర్వహించిన జాతీయ రక్తనాళాల ఆరోగ్య అవగాహన వాకథాన్ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి, నగర మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ పాల్గొన్నారు. డయాబెటిస్ కారణంగా కాళ్లు తొలగించాల్సిన పరిస్థితులు రాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో వాస్క్యులర్ సర్జన్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూకాలు తొలగింపు లేని గుంటూరు,కాలు తొలగింపు లేని భారతదేశం లక్ష్యంగా గుంటూరులోని వాస్క్యులర్ సర్జన్లు చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమం అభినందనీయమని, డయాబెటిస్‌తో పాటు అనారోగ్యకరమైన జీవనశైలి, ఆరోగ్యంపై నిర్లక్ష్యం కారణంగా చాలామంది కాళ్లు తొలగించాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు కాళ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చిన్న గాయం అయినా, ఏదైనా ఇబ్బంది తలెత్తినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను, ముఖ్యంగా రక్తనాళాల శస్త్రచికిత్స నిపుణులను సంప్రదించాలని సూచించారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించకపోవడం కూడా సమస్య తీవ్రతకు కారణమవుతోందని పేర్కొన్నారు.కాలు కోల్పోవడం వల్ల వ్యక్తి తన దైనందిన జీవితంలో ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందని, అది వారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని మహాభాగ్యంగా భావించి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షిస్తున్న సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సంపన్నమైన కుటుంబాల నిర్మాణంలో భాగంగా ప్రజలందరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు.