కొల్చారం మండలానికి 548 నూతన పింఛన్లు మంజూరు:
కొల్చారం …కొల్చారం మండలానికి 548 నూతన పింఛన్లు మంజూరైనట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల మల్లేశం గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి సహకారంతో పింఛన్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు.పింఛన్ల వివరాలు: దివ్యాంగులు 99, ఒంటరి మహిళలు 49, గీత కార్మికులు 22, వితంతువులు 348 మందికి మొత్తం 548 పింఛన్లు మంజూరయ్యాయి.రేపు ఉదయం 11 గంటలకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. పింఛన్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, ఆవుల రాజిరెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.