శ్రీ గురుదత్త శివానంద ఆశ్రమంలో వైభవంగా చండీయాగం : పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు,టిడిపి నేత నందకుమార్
మదనపల్లె రూరల్,మేజర్ న్యూస్ : చెంబకూరు రోడ్డు (మాలేపాడు క్రాస్) సమీపంలోని శ్రీ గురుదత్త శ్రీ శివానంద ఆశ్రమంలో ఆదివారం నిర్వహించిన చండీ యాగ మహోత్సవం వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు,మదనపల్లె మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులతో,శ్రీశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ సమక్షంలో జరిగిన ఈ మహోత్సవంలో పాల్గొని స్వామీజీల ఆశీస్సులు పొందారు.వర్షాలు సమృద్ధిగా కురిసి ఈ ప్రాంతం సస్యశ్యామలం చేయడం,ప్రజలు సంతోషాలతో ఉండాలన్నదే ఈ యాగం ముఖ్య ఉద్దేశ్యమన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజశేఖర్,బోనాల ఉమేష్,కేఎన్ఆర్,వేణుగోపాల్ రెడ్డి,పూల శంకర్,వెంకటరమణ,లక్ష్మీనారాయణ,మహేశ్వర్ రెడ్డి,మజ్జిగ కేశవ యాదవ్,మజ్జిగ లోకేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి