BREAKING
ఇందిరమ్మ ఇంటి కల సహకారం మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ కమల్ హాసన్‌తో నాటి పుకార్లపై జయసుధ స్పష్టత.. అసలు నిజం బయటపెట్టిన సహజ నటి మహిళా వర్సిటీలో ఘనంగా చిల్డ్రన్స్ డే కొత్త చెరువులో ప్లాస్టిక్ భూతం! గోవా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి అరివు చిత్రం ఎంపిక.. ఆసక్తి రేపుతున్న ప్రకటన మహారాష్ట్ర స్టేట్ స్కూల్స్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అజేయంగా నిలిచిన వీర్, హృదయ్ జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి శైలజకు ఘన సన్మానం రామాయణంలో రావణుడిగా యశ్.. ఆ అద్భుత రూపాల వెనుక ఉన్న సానియా సర్ధారియా విశేషాలు దివ్యాంగుల జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి.. గొర్రెల చోరీ నిందితుల అరెస్టు... రిమాండ్ కు తరలింపు.... కిసాన్‌ మోర్చా అధ్యక్ష బాధ్యతలు.. కృతజ్ఞతలు తెలిపిన మల్లారెడ్డి మంత్రి పొంగులేటి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ కిరణ్ మిత్ర డానియల్ మాజీ జెడ్పిటిసి సింగం సత్తయ్యను పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్ 600 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు

యాసంగి సాగులో పంటల మార్పిడికి రైతులు సహకరించాలి –

Select Suryaa Now
యాసంగి సాగులో పంటల మార్పిడికి రైతులు సహకరించాలి –

కొహెడ ; రాబోయే యాసంగి 2026–27 సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం మరియు భూగర్భ జలమట్టాలు తగ్గే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యత ఇవ్వాలని కొహెడ మండల వ్యవసాయ అధికారి సతీష్ ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాసంగి సీజన్‌లో వరి సాగుకు బదులుగా తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో వరి సాగు విస్తీర్ణంలో కనీసం 25 శాతం విస్తీర్ణాన్ని పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు మరియు ఇతర అనువైన ఉద్యాన, ఆయిల్ ఫామ్ పంటల సాగుకు మళ్లించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్ణయించిందని తెలిపారు. రైతులు తమ భూముల స్వభావం, నీటి లభ్యతను బట్టి శనగ, కంది, పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, నువ్వులు, వేరుశనగ తదితర పంటలను సాగు చేయడానికి ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి రైతు యాసంగిలో సాగు చేయదలచిన పంట, పంట విస్తీర్ణం, పంట రకం, పంట మార్పిడికి కావలసిన సదుపాయాలు మరియు తదితర వివరాలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) సేకరించి క్రాప్ డేటా పోర్టల్‌లో రైతువారీగా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున కొహెడ మండలంలోని రైతులందరూ తమ గ్రామానికి సంబంధించిన ఏఈఓలను వెంటనే సంప్రదించి, పంటల మార్పిడికి సంబంధించిన వివరాలను అందించి, క్రాప్ డేటా పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలని సూచించారు.
రైతువారీ వివరాల నమోదు ప్రక్రియను 16.11.2026, సోమవారం సాయంత్రంలోగా పూర్తి చేయాల్సి ఉన్నందున రైతులు గడువులోగా ఏఈఓ లకు సహకరించాలని కోరారు.
నీటి వనరులను సంరక్షించుకోవడం, కరువు పరిస్థితుల్లో పంట నష్టాలను తగ్గించుకోవడం మరియు రైతుల ఆదాయాన్ని కాపాడుకోవడంలో పంటల మార్పిడి ఎంతో కీలకమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రైతులు, గ్రామ సర్పంచులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు వ్యవసాయ శాఖకు సహకరించాలని మండల వ్యవసాయ అధికారి విజ్ఞప్తి చేశారు.