BREAKING
ఇందిరమ్మ ఇంటి కల సహకారం మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ కమల్ హాసన్‌తో నాటి పుకార్లపై జయసుధ స్పష్టత.. అసలు నిజం బయటపెట్టిన సహజ నటి మహిళా వర్సిటీలో ఘనంగా చిల్డ్రన్స్ డే కొత్త చెరువులో ప్లాస్టిక్ భూతం! గోవా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి అరివు చిత్రం ఎంపిక.. ఆసక్తి రేపుతున్న ప్రకటన మహారాష్ట్ర స్టేట్ స్కూల్స్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అజేయంగా నిలిచిన వీర్, హృదయ్ జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి శైలజకు ఘన సన్మానం రామాయణంలో రావణుడిగా యశ్.. ఆ అద్భుత రూపాల వెనుక ఉన్న సానియా సర్ధారియా విశేషాలు దివ్యాంగుల జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి.. గొర్రెల చోరీ నిందితుల అరెస్టు... రిమాండ్ కు తరలింపు.... కిసాన్‌ మోర్చా అధ్యక్ష బాధ్యతలు.. కృతజ్ఞతలు తెలిపిన మల్లారెడ్డి మంత్రి పొంగులేటి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ కిరణ్ మిత్ర డానియల్ మాజీ జెడ్పిటిసి సింగం సత్తయ్యను పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్ 600 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు

దివ్యాంగుల జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు

Select Suryaa Now
దివ్యాంగుల జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు

ఎడ్యుకేషన్ స్టాప్ రిపోర్టర్ : వికలాంగుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శాప్ ఆదేశాల మేరకు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో శనివారం ఎస్.వి.యూనివర్సిటీ క్రీడా మైదానంలో దివ్యాంగుల జిల్లా స్థాయి పారా క్రీడల ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలు ఆరు క్రీడాంశాలైన పారా అథ్లెటిక్స్, పారా బ్యాడ్మింటన్, పారా టేబుల్ టెన్నిస్, పారా తైక్వాండో, వీల్‌చైర్ ఫెన్సింగ్, బ్లైండ్ గోల్‌బాల్ విభాగాల్లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాజిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎన్.శశిధర్ హాజరై మాట్లాడుతూ జిల్లా స్థాయి పారా క్రీడల ఎంపికలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. ఈ ఎంపికల్లో 6  క్రీడా విభాగాలకు సంబంధించి మొత్తం 21 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు తలారి మోహన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరితో పాటు టెక్నికల్ అధికారులు ఎన్. నాగజ్యోతి, డి.కార్తీక్ పాల్గొని ఎంపిక నిర్వహణకు సహకరించారు. ఎంపికైన క్రీడాకారుల పేర్ల జాబితాను క్రీడాంశాల వారీగా, తదుపరి నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల తేదీ, వేదిక వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలియజేశారు. ఈ ఎంపికల్లో సుమారు 60 మంది క్రీడాకారులు, కోచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్