మహిళా వర్సిటీలో ఘనంగా చిల్డ్రన్స్ డే
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా 98వ ఎడిషన్ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని బాలల దినోత్సవం థీమ్‌తో ఘనంగా నిర్వహించారు. ఆదివారం జరిగిన కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ వి.ఉమ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.ఉష, వివిధ విభాగాల డీన్లు, శారీరక విద్యా విభాగాధిపతి ప్రొఫెసర్ జి.సారా సరోజిని హాజరయ్యారు. ఈ సందర్భంగా శారీరక విద్యా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సైక్లింగ్, యోగా, జుంబా వంటి శారీరక దృఢత్వాన్ని పెంచే కార్యక్రమాలను చేపట్టారు. ఆరోగ్యకర జీవనశైలి, శారీరక చురుకుదనం, వ్యాయామ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఫిట్ ఇండియా-హెల్తీ ఇండియా-యాక్టివ్ ఇండియా నినాదంతో ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలని సందేశం ఇచ్చారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్