BREAKING
ఇందిరమ్మ ఇంటి కల సహకారం మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ కమల్ హాసన్‌తో నాటి పుకార్లపై జయసుధ స్పష్టత.. అసలు నిజం బయటపెట్టిన సహజ నటి మహిళా వర్సిటీలో ఘనంగా చిల్డ్రన్స్ డే కొత్త చెరువులో ప్లాస్టిక్ భూతం! గోవా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి అరివు చిత్రం ఎంపిక.. ఆసక్తి రేపుతున్న ప్రకటన మహారాష్ట్ర స్టేట్ స్కూల్స్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అజేయంగా నిలిచిన వీర్, హృదయ్ జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి శైలజకు ఘన సన్మానం రామాయణంలో రావణుడిగా యశ్.. ఆ అద్భుత రూపాల వెనుక ఉన్న సానియా సర్ధారియా విశేషాలు దివ్యాంగుల జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి.. గొర్రెల చోరీ నిందితుల అరెస్టు... రిమాండ్ కు తరలింపు.... కిసాన్‌ మోర్చా అధ్యక్ష బాధ్యతలు.. కృతజ్ఞతలు తెలిపిన మల్లారెడ్డి మంత్రి పొంగులేటి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ కిరణ్ మిత్ర డానియల్ మాజీ జెడ్పిటిసి సింగం సత్తయ్యను పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్ 600 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు

600 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు

Select Suryaa Now
600 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు

 

సూర్య, లక్షెట్టిపేట :  పట్టణంలోని శ్రీనివాస గార్డెన్స్‌లో ఆదివారం చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలను మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ.. సమాజంలోని అసమానతలను తొలగించి పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెన్షన్ల ద్వారా చేయూతనందిస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మంచిర్యాల నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజా సేవకే తమ జీవితాలను అంకితం చేశామని వెల్లడించారు. అనంతరం సుమారు 600 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్‌పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి, సింగిల్ విండో చైర్మన్ నాగభూషణం, వెంకట్రావుపేట సర్పంచ్ నలిమేల రాజు, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ రాజేష్, పట్టణ అధ్యక్షుడు షాహిద్ అలీ, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఆరీఫ్, సర్పంచులు లత వెంకటేష్, శాతరసి బానేష్, గొడిసెల రాజేశం, ముత్తే శైలజ సుధాకర్, కౌన్సిలర్లు చంద్రమౌళి, తోట సువర్ణ రమేష్, సుజాత, పద్మ, చిన్నయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.