BREAKING
ఇందిరమ్మ ఇంటి కల సహకారం మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ కమల్ హాసన్‌తో నాటి పుకార్లపై జయసుధ స్పష్టత.. అసలు నిజం బయటపెట్టిన సహజ నటి మహిళా వర్సిటీలో ఘనంగా చిల్డ్రన్స్ డే కొత్త చెరువులో ప్లాస్టిక్ భూతం! గోవా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి అరివు చిత్రం ఎంపిక.. ఆసక్తి రేపుతున్న ప్రకటన మహారాష్ట్ర స్టేట్ స్కూల్స్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అజేయంగా నిలిచిన వీర్, హృదయ్ జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి శైలజకు ఘన సన్మానం రామాయణంలో రావణుడిగా యశ్.. ఆ అద్భుత రూపాల వెనుక ఉన్న సానియా సర్ధారియా విశేషాలు దివ్యాంగుల జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి.. గొర్రెల చోరీ నిందితుల అరెస్టు... రిమాండ్ కు తరలింపు.... కిసాన్‌ మోర్చా అధ్యక్ష బాధ్యతలు.. కృతజ్ఞతలు తెలిపిన మల్లారెడ్డి మంత్రి పొంగులేటి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ కిరణ్ మిత్ర డానియల్ మాజీ జెడ్పిటిసి సింగం సత్తయ్యను పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్ 600 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు

తెలియని కుటుంబానికి కట్టబెట్టడం కంటే సినీ రంగమే మేలు.. శ్రుతి హాసన్ గురించి కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Select Suryaa Now
తెలియని కుటుంబానికి కట్టబెట్టడం కంటే సినీ రంగమే మేలు.. శ్రుతి హాసన్ గురించి కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: దక్షిణాది సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరుగాంచిన కమల్ హాసన్ తన కుమార్తె శ్రుతి హాసన్ సినీ రంగ ప్రవేశంపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల సీనియర్ నటి సుహాసిని మణిరత్నంతో జరిగిన ఓ ప్రత్యేక సంభాషణలో శ్రుతి హాసన్ తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. తెలియని కుటుంబానికి పెళ్లి చేసి పంపడం కంటే, మనకు తెలిసిన సినీ కుటుంబంలో శ్రుతి పనిచేయడమే ఎంతో మంచిదని కమల్ హాసన్ గతంలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పిన విషయాన్ని ఆమె పంచుకున్నారు.

గతంలో సినీ ప్రముఖుల కుమార్తెలు నటన వైపు రావడం అరుదుగా ఉండేదని, కానీ ఆ సంప్రదాయాన్ని భేదించి తాము ముందుకు వచ్చామని శ్రుతి హాసన్ తెలిపారు. శ్రుతిని సినిమా రంగంలోకి ఎలా అనుమతించారని ఒకరు తన తండ్రిని అడిగినప్పుడు, మనకు పరిచయం లేని కుటుంబానికి కూతురిని ఇచ్చి పెళ్లి చేయడం కంటే మన కుటుంబంలాంటి సినీ పరిశ్రమలో ఆమె సంతోషంగా పనిచేయడమే మేలని కమల్ సమాధానమిచ్చారని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి సినిమా రంగాన్ని ఎంత గొప్పగా గౌరవిస్తారో ఆ మాటలే నిదర్శనమని శ్రుతి పేర్కొన్నారు.

కేవలం తన తండ్రి అనే కాకుండా, డెబ్బై రెండు ఏళ్ల వయసులోనూ కమల్ హాసన్ చూపుతున్న నిబద్ధత, కచ్చితత్వం తనకు ఎంతో స్ఫూర్తినిస్తాయని శ్రుతి హాసన్ వివరించారు. చిన్ననాటి నుంచి మేకప్ పట్ల తనకు ఆసక్తి కలగడానికి కూడా తండ్రే కారణమని సరదాగా చెప్పుకొచ్చారు. దశావతారం వంటి చిత్రాల్లో విభిన్నమైన మేకప్‌లతో కమల్ అలరించిన విషయాన్ని గుర్తు చేస్తూ, తనకు మేకప్ అంటే ఎందుకు ఇష్టమో ఆయనను అడగాల్సిన అవసరం లేదని అన్నారు.

ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శ్రుతి హాసన్, తమిళంలో ట్రైన్ చిత్రంతో పాటు తెలుగులో ఆకాశంలో ఒక తార సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల పలు చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు, పాటలతో ప్రేక్షకులను అలరించిన శ్రుతి, రాబోయే చిత్రాలతో మరింత జోరు చూపేందుకు సిద్ధమవుతున్నారు.