BREAKING
జపాన్ మాస్టర్స్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్.. హోరాహోరీ ఫైనల్‌లో కోకి వాటనాబేపై ఘన విజయం సర్పంచ్ కు 24, వార్డు మెంబర్లకు 74 నామినేషన్లు నెల్లూరు వీపీఆర్ నివాసంలో ఘనంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు లీజ్‌ ఒప్పందం పేరుతో అదనపు నగదు డిమాండ్‌.. మహిళా వ్యాపారికి బెదిరింపులు ఓటీటీలోకి వచ్చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ 'క్రేజీ కల్యాణం'.. ఆహాలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ కొమ్మర గ్రామవాసి ఇరగవరంలో అదృశ్యం మౌనికశ్రీ అకాడమీ విద్యార్థులకు కె.బి.ఆర్ ప్రతిభా పురస్కారములు దక్షిణ చైనా సముద్ర ప్రవర్తనా నియమావళిపై ఆసియా-చైనా చర్చల్లో ప్రతిష్టంభన జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన పడుగుపాడులో టీడీపీలో చేరిన 150 కుటుంబాలు.. తుఫాను వస్తోంది... అప్రమత్తంగా ఉండాలి ఏకగ్రీవ పంచాయతీలతో దివిసీమ గ్రామాల అభివృద్ధికి బాటలు జపాన్ వెకేషన్ ఫోటోలతో విజయ్ దేవరకొండ సందడి.. రష్మిక మందన్నపై ఆసక్తికర క్యాప్షన్లు ప్రభుత్వ మీడియా నిధుల ప్రణాళికను వ్యతిరేకిస్తూ ప్రాగ్‌లో వేలాది మంది చెక్ ప్రజల నిరసనలు కేటీఆర్‌ను కలిసిన కీసర బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చినింగని బాల్‌రాజ్

రామ్ చరణ్ సినిమాలో అవకాశం.. ఆ కారణంతోనే తిరస్కరించానన్న బండి సరోజ్ కుమార్

Select Suryaa Now
రామ్ చరణ్ సినిమాలో అవకాశం.. ఆ కారణంతోనే తిరస్కరించానన్న బండి సరోజ్ కుమార్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: విభిన్నమైన కథలు, సహజత్వం ఉట్టిపడే పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు బండి సరోజ్ కుమార్ ప్రస్తుతం ఛప్రి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బండి సరోజ్ కుమార్, గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది చిత్రంలో వచ్చిన అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించిన విషయాన్ని వెల్లడించారు.

దర్శకుడు బుచ్చిబాబు సనా స్వయంగా సంప్రదించి పెద్ది సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర చేయాలని బండి సరోజ్ కుమార్‌ను కోరారట. అయితే ఇతర హీరోల చిత్రాల్లో సహాయక పాత్రలు చేయకూడదని తాను ముందుగానే నిర్ణయించుకున్న కారణంగా ఆ ఆఫర్‌ను వద్దనుకున్నట్లు సరోజ్ తెలిపారు. సొంతంగా కథలు సిద్ధం చేసుకుంటూ దర్శకుడిగా, హీరోగా ఎదగాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.

పెద్ది సినిమా అవకాశాన్ని తిరస్కరించినప్పటికీ, తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని బండి సరోజ్ కుమార్ స్పష్టం చేశారు. తన పరాక్రమం సినిమా ఈవెంట్‌కు బుచ్చిబాబు సనా ఎటువంటి భేషజాలు లేకుండా హాజరై మద్దతు తెలిపారని, ఆయన గొప్ప మనసును ఎప్పటికీ మర్చిపోలేనని ప్రశంసించారు.

మాంగళ్యం, నిర్బంధం, పరాక్రమం వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన బండి సరోజ్ కుమార్, ఇటీవల మోగ్లీ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలోనూ ఆకట్టుకున్నారు. ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఛప్రి చిత్రంలో కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంతో పాటు పలు కీలక బాధ్యతలను తానే నిర్వహిస్తున్నారు. బీఎస్కే మెయిన్ స్ట్రీమ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో పలువురు నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.