BREAKING
ముత్యాలమ్మ దేవత నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డికి ఆహ్వానం. : కొనసాగుతున్న గ్రంధాలయ వారోత్సవాలు కరాటే క్రమశిక్షణకు పునాది... -ఆడపిల్లకు ప్రతి ఒక్కరూ తప్పక నేర్చుకోవాలి -ఘనంగా నవీన్ మార్షల్ ఆర్ట్స్ ఆరవ బ్రాంచ్ ప్రారంభం -కామన్ వెల్త్ విజేత సూర్యను శాప్ చైర్మన్ అభినందన డయాబెటిస్‌పై నిర్లక్ష్యం వద్దు..ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఎమ్మెల్యే గళ్ళా మాధవి *యాసంగి సాగులో పంటల మార్పిడికి రైతులు సహకరించాలి – రైతువారీ వివరాలను క్రాప్ డేటా పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి ఏఓ సతీష్ భీమవరం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా డాక్టర్ చుండూరి మల్లేశ్వరి చైర్మన్ అభ్యర్థిత్వంపై పలువురి పేర్లు ప్రచారంలోకి.. చివరకు వైద్యురాలికి జనసేన అధిష్టానం అవకాశం కవిత్వం రాయడం ఓ తపస్సు ,అమరావతి సాహితీ మిత్రులు సభలో డా. రావి రంగారావు న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా చరిత్ర.. ఒకే పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లు కైవసం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో " పుస్తక ప్రదర్శన " కీసరలో అమోర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం.. 300 మందికి పైగా వైద్య పరీక్షలు సేవ సమాజానికి స్ఫూర్తి...! -విశిష్ట సేవలందించిన వారికి సూర్యచంద్ర ఫౌండేషన్ పురస్కారాలు -అంకితభావంతో పనిచేసే వారికి గుర్తింపునివ్వడం అభినందనీయం : విసి ఉమ ఘనంగా పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ వార్షికోత్సవం పుస్తక పఠనంతోనే విజ్ఞానం వికాసం - గ్రంథాలయ అధికారి రాకేష్ అరంగేట్ర టెస్టు తొలి బంతికే అవుట్.. మహ్ఫిజుల్ ఇస్లామ్‌కు చేదు అనుభవం, రబాడ అరుదైన రికార్డు శ్రీకాళహస్తి పురపాలక సంఘం వైయస్సార్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా జ్ఞానాంబ గారి మధు రెడ్డి

పడుగుపాడులో టీడీపీలో చేరిన 150 కుటుంబాలు..

Select Suryaa Now
పడుగుపాడులో టీడీపీలో చేరిన 150 కుటుంబాలు..

నెల్లూరు,  మేజర్ న్యూస్ :    ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు   నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారని కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి   పేర్కొన్నారు. కోవూరు నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి.. రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
కోవూరు మండలం పడుగుపాడుకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీకి చెందిన కీలక నాయకుడు రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి మిత్రమండలి ఆధ్వర్యంలో దాదాపు 150కి పైగా కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి   మాట్లాడుతూ... ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు   నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు రావడం శుభపరిణామమన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ కోవూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. పార్టీలోకి వస్తున్న కొత్త నాయకులు ఇప్పటికే పార్టీ కోసం పనిచేస్తున్న పాత నాయకులు పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. వ్యక్తిగత విభేదాలకు తావులేకుండా పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యం
నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు స్పష్టం చేశారు. ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, తాను ప్రజల సేవకు నిరంతరం కట్టుబడి ఉంటామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతం కోసం నిబద్ధతతో కష్టపడి పనిచేసే ప్రతి నాయకుడు, కార్యకర్తకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని, వారి సేవలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

పంచాయతీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం
రానున్న పడుగుపాడు పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజల మద్దతుతో భారీ మెజార్టీతో విజయం సాధించాలన్నారు.