BREAKING
రామగిరి పంచాయతీ టిడిపి అభ్యర్థిగా బెస్త ఆదిలక్ష్మి శ్రీనివాసులు!!! పుట్లగట్లగూడెం సర్పంచ్ అభ్యర్థిగా మల్లిపూడి రవి నామినేషన్ తాడికొండ 220కేవీ సబ్ స్టేషన్ నో సందర్శించిన జెసి. సిరాజ్ మ్యాజిక్ డెలివరీ.. ఫిన్ అలెన్ వికెట్ నేలకూల్చిన భారత పేసర్ గుర్తింపు' ఎప్పుడు... గోవిందా....! -టీటీడీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులపై కనికరం చూపండి సారూ... -ఐడీ కార్డులు, మెడికల్, లడ్డుకార్డుల జారీలో జాప్యమెందుకో... -పాలకమండలి నిర్ణయించినా అమలు చేయడంలో నిర్లక్ష్యమా...! శ్రీకాళహస్తి పురపాలక సంఘం తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థిగా పేట బాలాజీ రెడ్డి బిజెపి ఎస్టి మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు.... నిండుకుండలా ఎల్ ఎన్ డి పేట రిజర్వాయర్ --180 క్యూసెక్కులు దిగువకు విడుదల పురాతన ఆలయాకృతికి పూర్వవైభవం తీసుకురావాలి..! -- ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వన్డేల్లో జో రూట్ అరుదైన మైలురాయి.. ఇంగ్లండ్ తరఫున యాభై అర్ధశతకాలు పూర్తి ముత్యాలమ్మ దేవత నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డికి ఆహ్వానం. : కొనసాగుతున్న గ్రంధాలయ వారోత్సవాలు కరాటే క్రమశిక్షణకు పునాది... -ఆడపిల్లకు ప్రతి ఒక్కరూ తప్పక నేర్చుకోవాలి -ఘనంగా నవీన్ మార్షల్ ఆర్ట్స్ ఆరవ బ్రాంచ్ ప్రారంభం -కామన్ వెల్త్ విజేత సూర్యను శాప్ చైర్మన్ అభినందన డయాబెటిస్‌పై నిర్లక్ష్యం వద్దు..ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఎమ్మెల్యే గళ్ళా మాధవి *యాసంగి సాగులో పంటల మార్పిడికి రైతులు సహకరించాలి – రైతువారీ వివరాలను క్రాప్ డేటా పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి ఏఓ సతీష్

కవిత్వం రాయడం ఓ తపస్సు ,అమరావతి సాహితీ మిత్రులు సభలో డా. రావి రంగారావు

Select Suryaa Now
కవిత్వం రాయడం ఓ తపస్సు ,అమరావతి సాహితీ మిత్రులు సభలో డా. రావి రంగారావు
గుంటూరు న్యూస్ : కవిత స్పష్టంగా ఉండాలని, మనసులో స్పష్ట చిత్రం పడితేనే అర్థమవుతుందని, భావం వెలువరించే ప్రతి పదం పదునుగా ఉండాలని, అందుకు తగ్గట్టు వాక్య నిర్మాణం సూటిగా ఉండేందుకు కవులు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని అమరావతి సాహితీ మిత్రులు వ్యవస్థాపకులు డా. రావి రంగారావు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం బ్రాడీపేట సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ సమావేశ మందిరంలో జరిగిన అమరావతి సాహితీ మిత్రులు మూడో ఆదివారం సమావేశానికి తమ్మా ధనుంజయ రెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా విమల సాహితి సంపాదకులు డా. జెల్ది విద్యాధర్ రచించిన "తాజ్ మహల్" కవితల సంపుటిని డా. రావి రంగారావు ఆవిష్కరించి ప్రసంగించారు.డా. రావి రంగారావు ప్రసంగిస్తూ కవితలో ఓ చోట చెప్పిన భావాన్ని మరోచోట చెబితే బిగింపులో పట్టు తగ్గుతుందని, ఓ క్రమ పద్ధతిలో భావాలను వ్యక్తపరిస్తే మనసు ఆలోచనామృతం అవుతుందని తెలిపారు. కవిత్వంతో కలిగే ఆనందాన్ని ప్రతి ఒక్కరూ చవి చూడాలని ఆయన పిలుపు నిచ్చారు. యర్రగుంట్ల పాణిరావు, పింగళి భాగ్యలక్ష్మి గ్రంథ సమీక్ష చేశారు.డా. జెల్ది విద్యాధర్ ప్రసంగిస్తూ గుంటూరు అమరావతి సాహితీ మిత్రుల సమక్షంలో తన పుస్తకం ఆవిష్కరణ ఆనందకరమని పేర్కొన్నారు. స్త్రీ లేని ప్రదేశం ఎడారితో సమానమని, స్త్రీల త్యాగాల గురించి చెప్పాలంటే ఎన్నో గ్రంథాలు రాయాలని పేర్కొంటూ స్త్రీ స్వేచ్ఛను హరించే దురదృష్టకరమైన పరిస్థితి నేడు నెలకొని ఉందని, దీని పట్ల ప్రజా చైతన్యం అవసరమని గ్రంథ రచయిత విద్యాధర్ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్వహించిన కవితలు, కథలు, రీల్స్ పోటీలకు బండికల్లు జమదగ్ని న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. విజేతలుగా నిలిచిన మేడిశెట్టి సుభద్రా కృష్ణ, బండ్ల సుబ్రహ్మణ్యం, పరుచూరి కృష్ణ భార్గవి, జయ మాధురిలను శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సాహితీ సభలో పింగళి భాగ్యలక్ష్మి నిర్వహణలో సిహెచ్. వెంకటరత్నం, గడల శివప్రసాద్, పగడాల వెంకటరెడ్డి, తాటికోల పద్మావతి, తుమ్మల సాంబశివరావు, రాయసం గిరిజారాణి, రేపల్లె రాజ్ కృష్ణ, పాటిబండ్ల కవిత, పుట్టంరాజు నరసింహమూర్తి తదితర కవులు పాల్గొని తమ రచనలు వినిపించారు.