నిండుకుండలా ఎల్ ఎన్ డి పేట రిజర్వాయర్ --180 క్యూసెక్కులు దిగువకు విడుదల
పోలవరం, మేజర్ న్యూస్: ఆర్నాబ్ మురుసు తుఫాన్ల ప్రభావంతో కురిసిన అతి భారీ వర్షాల ప్రభావంతో ఎగువ అటవీ ప్రాంతాల్లో కొండ వాగుల జలాలతో మునుపేప్పుడు లేని విధంగా ఎల్ ఎన్ డి పేట రిజర్వాయర్ వరద జలాలతో నిండి కుండ లా మారింది గతంలో వర్షాలు కురిసిన రిజర్వాయర్లో సరిపడే విధంగా జలాలు ఉండేవి దిగువకు విడుదల చేసే అవసరం గత 10ఏళ్లలో ఏనాడు కలగలేదు. ఈ ఏడాది మురుసు తుఫాను ప్రభావంతో వాగులు పొంగడంతో తరచూ నిండుతున్న రిజర్వాయర్ నీటిని క్రమబద్ధకరించేందుకు గత నెల 30 నుండి నేటి వరకు అధికారులు దశలవారీగా నీటిని దిగువకు విడుదల చేశారు .ప్రస్తుతం మొబైల్లో 0.414 టీఎంసీ నీటి నిలువలు ఉన్నాయని ఎగువ నుండి రిజర్వాయర్ లోకి79క్యూసిక్కుల జలాలు వస్తున్న నేపథ్యంలో రిజర్వాయర్ నుండి180 క్యూ సిక్కుల జలాలను దిగువకు విడుదల చేశామని కొవ్వాడ కాలవ ఏఈ రాహుల్ భాస్కర్ తెలిపారు.