ఘనంగా రోషిణి–గిరీష్ గౌడ్‌ల వివాహ వేడుక.
రామయంపేట ; రామాయంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె. జితేందర్ గౌడ్ కుమార్తె రోషిణి వివాహం గిరీష్ గౌడ్‌తో ఆదివారం హైదరాబాద్‌లోని మేడ్చల్ మండలం మునీరాబాద్‌లో గల అద్వయ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రుల సమక్షంలో వివాహ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ వేడుకకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులు రోషిణి, గిరీష్ గౌడ్‌లను ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.అలాగే మాజీ ఉపసభాపతి ఎం. పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి,నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డిలు వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్ బాదే చంద్రం, మున్సిపల్ మాజీ వైస్ చైర్‌పర్సన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, పలువురు జిల్లా నాయకులు, పార్టీ కార్యకర్తలు, బంధుమిత్రులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.