BREAKING
అంగన్వాడి కేంద్రంలో సామూహిక సీమంతాలు అన్నప్రాసరణ బాధిత కుటుంబానికి సీఎంఆర్ చెక్కు పంపిణీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజల సహకరించాలి. జపాన్ ఓపెన్ ఫైనల్లో లక్ష్యసేన్.. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో మరో అరుదైన ఘనత తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బైకర్‌కు స్వల్ప గాయాలు! కల్వకుంట అంగన్వాడీలో మందుబాబుల హల్చల్ భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ.. ఐసీసీ మెగా టోర్నీల క్యాలెండర్ విడుదల శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌ బౌలర్ల పోరాటంతోనే చారిత్రక సిరీస్ విజయం.. శ్రేయస్ అయ్యర్ హర్షం గ్రంథాలయాలకు రండి.. విజ్ఞానాన్ని పెంచుకోండి పురవీధుల్లో విద్యార్థుల భారీ ర్యాలీ పూతలపట్టు గ్రంథాలయంలో ఘనంగా పుస్తక ప్రదర్శన ఘనంగా రోషిణి–గిరీష్ గౌడ్‌ల వివాహ వేడుక. కొల్చారం మండలానికి 548 నూతన పింఛన్లు మంజూరు: చీరాల వాడరేవు రోడ్ లో రోడ్డు ప్రమాదం ఒకరి పరిస్థితి విషమం క్రీడా హబ్ గా తిరుపతి -రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం -ముఖ్య అతిథిగా హాజరైన శాప్ చైర్మన్ రవి నాయుడు *విశ్రాంత జేడీ డాక్టర్ బూసి అంజయ్యకు ఘన నివాళులు* --ఉద్యోగ, వ్యాపార, రాజకీయ ప్రముఖుల సంతాపం

బిజెపి ఎస్టి మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు....

Select Suryaa Now
బిజెపి ఎస్టి మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు....
 సూర్య కరీంనగర్ ; భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు రమావత్  శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున  కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో భగవాన్ బిర్సా ముండా జయంతి, జాతీయ గౌరవ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, ఎస్టి మోర్చా నాయకులతో కలిసి బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులను ఏకం చేసి, అటవీ హక్కులు, ఆదివాసీల ఆత్మగౌరవం కోసం భగవాన్ బిర్సా ముండా చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. గిరిజన సమాజం పట్ల ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బిర్సా ముండా జయంతిని 'జనజాతీయ గౌరవ దివస్'గా ప్రకటించడం గిరిజనులకు దక్కిన గౌరవమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొట్టే మురళీకృష్ణ,   కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు,   బిజెపి జిల్లా ఉపాధ్యక్షురాలు గాజుల స్వప్న,  కార్పొరేటర్లు బండ రమణ , వెస్ట్  జోన్ అధ్యక్షులు జాడి బాల్ రెడ్డి , ఎస్టి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మొగిలి శ్రీనివాస్,  ఉపాధ్యక్షులు లావుడియా తిరుపతి నాయక్ కార్యదర్శి బానోత్ శివ నాయక్  సోషల్ మీడియా కోకన్వీనర్ మా లోతు దీక్షిత్ నాయక్  బిజెపి నాయకులు కార్యకర్తల తో పాటు జిల్లా ఎస్టీ మోర్చా పదాధికారులు, బిజెపి జిల్లా నాయకులు, కార్యకర్తలు  గిరిజన సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.