ముత్యాలమ్మ దేవత నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డికి ఆహ్వానం. :
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి. :
సారంగాపూర్ మండలం యాకర్‌పల్లి గ్రామంలో ఈ నెల 27-11-2026 నుండి 29-11-2026 వరకు నిర్వహించనున్న శ్రీ ముత్యాలమ్మ దేవత నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన, ప్రారంభోత్సవ మహోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి ని గ్రామ ప్రజలు సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కాల్వ నరేష్, ఉపసర్పంచ్ శ్రీకాంత్, మేకల చంద్రశేఖర్, మేకల నవీన్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.